source: X
ఫ్రాన్స్ మాజీ ప్రధాని ఎడ్వర్డ్ బాల్లదూర్ (97) కన్నుమూశారు. ఆయన మరణించిన విషయాన్ని ప్రస్తుత ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను సోమవారం వెల్లడించారు. ఫ్రాన్స్ రాజకీయాల్లో దాదాపు ఐదు దశాబ్దాల పాటు బాల్లదూర్ కీలక పాత్ర పోషించారు. ఆర్థిక సంస్కరణలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలో ఆయనది ముఖ్యమైన పాత్ర.
1986లో అప్పటి ప్రధాని జాక్ షిరాక్ ప్రభుత్వంలో ఆర్థిక, ఆర్థిక వ్యవహారాలు, ప్రైవేటీకరణ మంత్రిగా పనిచేసిన బాల్లదూర్.. పలు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు.
1993లో ప్రధానిగా బాధ్యతలు
1988 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత జాక్ షిరాక్ ప్రధాని పదవిలో కొనసాగేందుకు ఆసక్తి చూపకపోవడంతో.. 1993లో అప్పటి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ మిత్తెరాన్ బాల్లదూర్‌ను ప్రధానమంత్రిగా నియమించారు.
ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని మరింత విస్తరించడంతో పాటు ఫ్రాన్స్‌లో రాజకీయంగా అత్యంత సున్నితమైన పింఛన్ వ్యవస్థలో సంస్కరణలను కూడా చేపట్టారు.
చదవండి: గాజాపై ఇజ్రాయెల్ దాడులు.. ఐదుగురు మృతి


