నోబెల్‌ శాంతి బహుమతికి ఎలాన్‌ మస్క్‌ నామినేట్‌ | Elon Musk nominated for Nobel Peace Prize 2025 | Sakshi
Sakshi News home page

నోబెల్‌ శాంతి బహుమతికి ఎలాన్‌ మస్క్‌ నామినేట్‌

Jan 31 2025 4:51 AM | Updated on Jan 31 2025 10:19 AM

Elon Musk nominated for Nobel Peace Prize 2025

లండన్‌: నోబెల్‌ శాంతి బహుమతి–2025కి ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్‌ఎక్స్, ఎక్స్‌ సంస్థల అధినేత ఎలాన్‌ మస్క్‌ నామినేట్‌ అయ్యారు ఈ మేరకు నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీకి ఒక పిటిషన్‌ సమర్పించినట్లు యూరోపియన్‌ పార్లమెంట్‌ సభ్యుడు బ్రాంకో గ్రిమ్స్‌ ఫేస్‌బుక్‌ పోస్టులో పేర్కొన్నారు. 

ప్రపంచ ప్రఖ్యాత బహుమతికి ఎలాన్‌ మస్క్‌ నామినేట్‌ కావడం ప్రపంచవ్యాప్తంగా భావ ప్రకటనా స్వేచ్ఛను, మానవ హక్కులను కాపాడటానికి ఆయన చేసిన కృషికి ఒక గుర్తింపు అని వెల్లడించారు. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాన్‌ మస్క్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement