England Student Earns 50k Per Month By Organising People Wardrobes, See Her Story - Sakshi
Sakshi News home page

పార్ట్‌టైం జాబ్‌తో నెలకు 50వేల సంపాదన.. ఎలానో తెలుసా?

Jan 22 2022 7:16 PM | Updated on Jan 22 2022 8:30 PM

Ella Earns Fifty Thousand Per Month Decluttering Wardrobe England - Sakshi

ఉద్యోగం చేసి జీతం సరిపోకపోతే, అదనపు సంపాదన కోసం పలువురు పార్ట్‌టైం ఉద్యోగం చేస్తుంటారు. పార్ట్‌ టైం ఉద్యోగాలు కొన్ని కష్టంగా ఉంటే.. మరికొన్ని మాత్రం ఆడుతు పాడుతు చేసివిగా ఉంటాయి. పార్ట్‌ ఉద్యోగాలు కొన్ని.. ఫన్నీగా అనిపించినా ఆదాయం మాత్రం భారీగా ఉంటుంది. తాజాగా ఓ యువతి పార్ట్‌ ఉద్యోగం చేసి నెలకు రూ.50వేలు సంపాదిస్తోంది. ఆ పార్ట్‌ టైం ఉద్యోగం ఏంటో తెలుసా? బట్టలు సర్దడం. అదేంటని ఆశ్చర్య పోతున్నారా? మీరు విన్నది నిజమే.. విదేశాల్లో వార్డ్‌రోబ్‌లో బట్టలు సర్దుకుంటారు.

వాటిని సర్దుకునే టైమ్‌లేని వాళ్లు.. ఇతరులతో ఆ పని చేయించుకొని డబ్బు ఇస్తారు. ఇంగ్లండ్‌లోని లైసెస్టర్‌కు చెందిన ఎల్లా అనే ఓ యువతి.. అదనపు డబ్బు కోసం ఓ పార్ట్‌ టైం జాబ్ వెతుక్కుంది. అదే వార్డ్‌రోబ్‌లో బట్టల్న సర్దడం.. కలర్లు, బట్టల రకాలను బట్టీ సర్దడం. బట్టలను అందంగా వార్డ్‌రోబ్‌లో  సర్దడం కూడా ఓ రకమైన ఆర్ట్. పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ.. మంచి నైపుణ్యం సంపాదించింది ఆమె.

బట్టలు సర్దడం కోసం ఎల్లా గంటకు 1500 నుంచి 2000 ఛార్జ్‌ వేస్తుంది. ఆమె పనితీరు కస్టమర్లకు నచ్చడంతో.. పార్ట్‌టైం ఉద్యోగంతోనే ఎల్లా వేలకువేలు సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమెకు 20 మంది వరకు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. ఇలా బట్టలు సర్ది.. ఎల్లా ప్రస్తుతం నెలకు 50వేల దాకా ఆదాయాన్ని వెనకేస్తోంది. సోషల్‌ మీడియాలో ఈ వార్త వైరల్‌ కావడంతో.. ఇలా కూడా సంపాదిస్తారా! అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement