న్యూజిలాండ్‌లో భారీ భూకంపం

Earthquake Strikes New Zealand With More Than 7 Magnitude - Sakshi

సునామీ హెచ్చరికలు జారీ చేసిన పీటీడబ్ల్యూసీ

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టార్‌ స్కేల్‌ మీద దీని తీవ్రత 7.3గా నమోదయ్యింది. శుక్రవారం తెల్లవారుజామున న్యూజిలాండ్ ఉత్తర ద్వీపానికి తూర్పుగా భూకంపం సంభవించినట్లు పసిఫిక్ సునామి హెచ్చరికల కేంద్రం (పీటీడబ్ల్యూసీ) వెల్లడించింది. అమెరికన్‌ జియోలాజికల్ సర్వే ప్రారంభంలో ఈ భూకంపం తీవ్రతను 7.3గా పేర్కొన్నది.. ఆ తరువాత దానిని 6.9కి సవరించింది. 10 కిలోమీటర్ల (6 మైళ్ళు) లోతులో భూకంపం సంభవించిందని తెలిపింది. భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల దూరంలో సునామీ తరంగాలు ఏర్పడే అవకాశం ఉందని పీటీడబ్ల్యూసీ తెలిపింది.. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.

చదవండి: ఊగిపోయిన రాహుల్‌ గాంధీ గది!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top