దుబాయ్: ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB) టెర్మినల్ 1కి వెళ్లే కొత్త వంతెనను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రారంభించింది. దుబాయ్ ఏవియేషన్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్స్ భాగస్వామ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా వంతెనను మూడు లేన్ల నుంచి నాలుగు లేన్లకు విస్తరించారు. దీని ఫలితంగా, వంతెన సామర్థ్యం గంటకు 4,200 వాహనాల నుంచి 5,600 వాహనాలకు అంటే సుమారు 33 శాతం పెరిగింది.
ఆర్‌టీఏ ప్రకారం.. ఈ విస్తరణ ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా గరిష్ట ప్రయాణ సమయాల్లో టెర్మినల్ 1కి వెళ్లే వాహనాల రద్దీని తగ్గిస్తుంది. వంతెన విస్తరణలో భాగంగా రహదారి పేవ్‌మెంట్, మెరుగైన యుటిలిటీ, సపోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వంతెనను చుట్టుపక్కల రహదారి నెట్వర్క్‌తో కలిపే ల్యాండ్‌స్కేపింగ్ వంటి పనులు కూడా చేశారు. అలాగే కొత్త వీధి దీపాలు కూడా ఏర్పాటు చేశారు.


