ఎనిమిది నోబెల్‌ అవార్డులివ్వాలి! | Donald Trump slammed Norway for passing him over for the Nobel Peace Prize | Sakshi
Sakshi News home page

ఎనిమిది నోబెల్‌ అవార్డులివ్వాలి!

Oct 11 2026 6:24 AM | Updated on Oct 11 2026 6:24 AM

 Donald Trump slammed Norway for passing him over for the Nobel Peace Prize

భారత్, పాక్‌ యుద్ధం ఆపాను 

ఐదు కోట్ల ప్రాణాలు కాపాడా 

చరిత్రలో మరెవ్వరికీ లేని రికార్డు నాది 

అవార్డు ఇవ్వకపోవడాన్ని మరచిపోము

వాషింగ్టన్‌: ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతి తనకు దక్కకపోవడంపై  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. నార్వేపై విమర్శలు గుప్పించారు. అణ్వాయుధ సామర్థ్యమున్న భారత్, పాకిస్థాన్‌ల మధ్య యుద్ధం నిలువరించి ఐదు కోట్ల ప్రాణాలు కాపాడానని ఆచప సైరక్యూస్‌లో శుక్రవారం చెప్పుకున్నారు. ‘‘ద యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికాకు అధ్యక్షుడి హోదాలో ప్రాతినిథ్యం వహిస్తున్న నాకు నోబెల్‌ శాంతి బహుమతి దక్కి ఉండాల్సింది. ఇవ్వలేదు.

 ఇది నార్వేపై చెరిపేయలేని మచ్చ,. అంతటి అవమానకరమైన, ఇబ్బందికరమైన నిర్ణయం తీసుకుంది ఆ దేశం’’ అని వ్యాఖ్యానించారు. ‘‘కొంతమంది ప్రజాస్వామ్య వ్యతిరేకులు, నాగరకతకు అసలైన శత్రువులు, తీవ్రవాద భావజాలం ఉన్న వారి కారణంగా నోబెల్‌ శాంతి బహుమతి విశ్వసనీయత శాశ్వతంగా దెబ్బతింది. నార్వే... ఆ బహుమతి నాకివ్వలేదన్న విషయాన్ని మరచిపోము’’ అని అన్నారు. 

ఈ ఏటి నోబెల్‌ శాంతి బహుమతి దక్షిణాఫ్రికా న్యాయ కోవిదురాలు, భారతీయ సంతతికి చెందిన నవనీతం పిళ్లైకు దక్కిన విషయాన్ని ప్రస్తావిస్తూ.... అమె గురించి ఎవరికీ తెలియదు అంటూనే.... ‘‘ఏదైతేనేం.. శుభాభినందనలు’’ చెప్పారు. తన పదవీకాలంలో ఆపేసిన యుద్ధాల చిట్టా విప్పిన ట్రంప్‌.. ఇంకో రెండింటిని ఆపాల్సి ఉందని, ఇరాన్, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధాలను పరోక్షంగా సూచించారు.

 ‘‘చరిత్రలోనే అత్యధికంగా యుద్ధాలు ఆపిన నాకు శాంతి బహుమతి ఇవ్వలేదన్న విషయాన్ని మరచిపోము నార్వే... నిజానికి ఒక్కో యుద్ధానికి లెక్కవేసి ఎనిమిది నోబెల్‌ శాంతి బహుమతులు ఇచ్చి ఉండాల్సింది నాకు. కానీ నువ్వు (నార్వే) యునైటెడ్‌ స్టేట్‌ ఆఫ్‌ అమెరికాకు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వలేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. 

‘‘... దీనికి (ఎనిమిది యుద్ధాలు ఆపడం) అదనంగా ఇరాన్‌ అణ్యాయుధాలు దక్కకుండా చేసి మధ్యప్రాచ్యం మొత్తం పేలిపోకుండా కూడా నిరోధించా. మధ్యప్రాచ్యానికి మించి యూరప్‌.. బహుశా అమెరికాతో కలిపి నేను కాపాడినన్ని ప్రాణాలు చరిత్రలో ఇంకెవరూ కాపాడి ఉండరు’’ అని అన్నారు. నోబెల్‌ శాంతి బహుమతులు ఇప్పటివరకూ నలుగురు అమెరికా అధ్యక్షులు థియోడర్‌ రూజ్‌వెల్ట్, వుడ్రో విల్సన్, జిమ్మీ కార్టర్‌లతోపాటు 2009లో బరాక్‌ ఒబామాకు దక్కాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ తరచూ ఒబామాకు అవార్డు దక్కడంపై... ‘‘ఏం చేయకుండానే బహుమతి వచ్చింది’’ అంటూ విమర్శిస్తూంటారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement