ఆ దేశాలు గాలి నాణ్యతను పట్టించుకోవట్లేదు: ట్రంప్‌

Donald Trump: India China Russia Dont Take Care Of Their Air - Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన దూకుడు వ్యాఖ్యలతో మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. భారత్‌, చైనా, రష్యా వాయు కాలుష్యాన్ని అదుపులోకి తీసుకు రాలేక పోతున్నాయని ట్రంప్‌ విమర్శల దాడికి దిగారు., తమ గాలి నాణ్యతను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. కాలుష్యాన్ని నియంత్రించడానికి అమెరికా ఎంతో కృషి చేస్తోందని, తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంత కాలం తమ దేశాన్ని నెంబర్ వన్ స్థానంలోనే నిలబెడతానని ట్రంప్ చెప్పారు. కొన్నేళ్లుగా ఇతర దేశాలను తొలి స్థానంలో నిలబెట్టామని, ఇప్పుడు అమెరిగా మొదటి స్థానంలో ఉందని అన్నారు. (‘మిస్టర్‌ బెజోస్‌.. మీరు మ్యూట్‌లో ఉన్నారు’)

ట్రంప్‌ బుధవారం టెక్సాస్‌లోని మిడ్‌ల్యాండ్‌లో చమురు క్షేత్రం పెర్మియన్‌ బేసిన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డెమోక్రాట్లు అమెరికాను నాశనం చేయాలనుకుంటున్నారన్నారు. అమెరికన్ల జీవన విధానంపై డెమోక్రాట్లకు గౌరవం లేదని విమర్శించారు. గత పరిపాలనలో పరిశ్రమలపై పరిమితులను విధించడం ద్వారా లెక్కలేనన్ని అమెరికన్ ఉద్యోగాలు, కర్మాగారాలు, చైనాకు, ఇతర దేశాలకు తరలించాయన్నారు. గత ప్రభుత్వంలో అమెరికా ఎనర్జీ రంగాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయని, యూఎస్ అధ్యక్షుడిగా తాను బాధ్యతలను తీసుకున్న తర్వాత ఆ ప్రయత్నాలను అంతం చేశానని ట్రంప్ చెప్పారు. ప్రపంచ చరిత్రలో అమెరికన్ల జీవన విధానం కంటే మెరుగైనది లేదని చెప్పారు. తమ దేశ ప్రజలకు మాతృభూమి అన్నా, జాతీయగీతమన్నా, జాతీయ జెండా అన్నా చాలా ఇష్టమని అన్నారు. (టీకా ఇతర దేశాలకూ ఇస్తాం: ట్రంప్‌)

ప్యారిస్ వాతావరణ ఒప్పందం అమెరికాకు ఆర్థిక భారమని… ఒప్పందం నుంచి బయటకు రావడం వల్ల బిలియన్ల డాలర్లు ఆదా అయ్యాయని తెలిపారు. పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగాలని యూఎస్ గత ఏడాది నవంబర్‌లో అధికారికంగా తెలియజేసింది. 2020 నవంబర్ 4న అమెరికా ఈ ఒప్పందం నుంచి బయటపడనుంది. దాదాపు 70 ఏళ్ల తర్వాత అమెరికా ఎనర్జీ ఎగుమతిదారుగా ఎదిగిందని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు, సహజవాయువు ఉత్తత్తిదారుగా అమెరికా అవతరించిందని తెలిపారు. (వైస్‌ ప్రెసిండెంట్‌ అభ్యర్ధిగా కమలా హారిస్‌!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top