కౌలాలంపూర్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా రోజులు తర్వాత మళ్లీ ఫుల్ జోష్‌లో కనిపించారు. ఆనందంలో డ్యాన్స్ చేస్తూ కేరింతలు కొట్టారు. మలేషియా పర్యటనలో భాగంగా ట్రంప్ ఇలా స్టెప్పులు వేయడం విశేషం. ట్రంప్ డ్యాన్స్(Trump Dance Video) వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆసియాన్ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)మలేసియా పర్యటనకు వెళ్లారు. అమెరికా నుంచి దాదాపు 23 గంటల పాటు విమాన ప్రయాణం చేసిన ట్రంప్.. ఆదివారం కౌలాలంపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం (Malaysian Prime Minister Anwar Ibrahim) ఘన స్వాగతం పలికారు. అయితే, ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి కిందకు దిగగానే ట్రంప్ రెడ్ కార్పెట్‌పై నడుచుకుంటూ వస్తుండగా.. అక్కడ ఓ బృందం మలేషియా సంప్రదాయ నృత్యం చేస్తోంది.
Such a beautiful arrival ceremony for President Trump in Malaysia 🇺🇸🇲🇾 - and he broke out the Trump Dance!
🎥: @MargoMartin47 pic.twitter.com/igTo36ofBs— Monica Crowley (@MonicaCrowley) October 26, 2025
దీంతో, వారి సంగీతం, నృత్యం ట్రంప్‌కు నచ్చడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఎయిర్‌పోర్టులో డ్యాన్స్ చేస్తున్న వారిపైపు నడిచి ట్రంప్ తన మార్క్ డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇక అతిథి ట్రంప్‌తో పాటు.. మలేషియా ప్రధాని అన్వర్ కూడా సంగీతానికి అనుగుణంగా స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉండగా.. ఆసియాన్ దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు ట్రంప్.. మలేషియా పర్యటనకు వచ్చారు. ఈ సమావేశంలో భారత ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించనున్నారు. ఆసియాన్ సదస్సులో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, జపాన్ కొత్త ప్రధాని తకాయిచి, దక్షిణ కొరియా నేతలు కూడా పాల్గొననున్నారు.


