ఇంటికి మరమ్మతు చేస్తుండగా.. బాత్‌ టబ్‌ కింద ‘మరో ప్రపంచం’ | US Couple Discovers Shocking Secret During Renovation | Sakshi
Sakshi News home page

ఇంటికి మరమ్మతు చేస్తుండగా.. బాత్‌ టబ్‌ కింద ‘మరో ప్రపంచం’

Jun 6 2024 2:17 PM | Updated on Jun 6 2024 3:08 PM

US Couple Discovers Shocking Secret During Renovation

ఇంటిలోని స్టోర్‌రూమ్‌ను శుభ్రం చేస్తున్నప్పుడో లేదా ఇంటికి మరమ్మతులు చేస్తున్నప్పుడో మనకు అనుకోని రీతిలో పాతబడిన వస్తువులు కనిపించి ఆశ్చర్యం కలిగిస్తాయి. అటువంటి సందర్భాల్లో ఆ వస్తువులతో మనకు ఆనాడు ఉన్న అనుబంధం గుర్తుకు వస్తుంది. ఇటువంటి ఘటనే ఒక జంటకు ఎదురయ్యింది. 

వివరాల్లోకి వెళితే అమెరికాలోని మిచిగాన్‌ స్టేట్‌కు చెందిన హేలీ గిల్‌మార్టిన్,  ఆమె భర్త ట్రెవర్‌లు లేక్ హురాన్ సమీపంలో ఉంటున్నారు. వారు తమ ఇంటికి మరమ్మతులు చేయిస్తున్నారు. ఈ నేపధ్యంలో వారు ఇంటిలోని ఒక బాత్‌ టబ్‌ను తొలగించాలని భావించారు. పనివారి చేత వారు ఆ బాత్‌ టబ్‌ను తొలగించగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి వారు షాక్‌ అయ్యారు.

ఆ బాత్‌టబ్‌ కింద కొంతవరకూ నీటితో నిండిన ఒక గది కనిపించింది. ఇది వారికి ఎంతో వింతగా అనిపించింది. ఆ భార్యాభర్తలు సాహసం చేసి, ఆ గదిలోనికి ఎలాగోలా వెళ్లారు. నీటితో నిండిన ఆ గదిలో ఒకవైపు నుంచి మరోవైపునకు వెళ్లారు. అది ఒక సరస్సుకు దారి తీసున్నదని తెలిసి వారు అవాక్కయ్యారు. దీనిని పూర్వకాలంలో స్మగ్లింగ్‌కు వినియోగించేవారేమోనని వారు భావిస్తున్నారు. అయితే ఆ చుట్టుపక్కల ఇళ్లలోనూ ఇలాంటి సొరంగాలు ఉన్నట్లు వారు గుర్తించారు. కాగా ఆ జంట ఆ బాత్‌ టబ్‌ను తొలగించి, ఆ ప్లేస్‌ను గేమ్‌ రూమ్‌గా మార్చాలనుకున్నారట. 

Advertisement
 
Advertisement
Advertisement