పోరాటాలకు సిద్ధం కావాలి

China top leaders appear at National Day event ahead of major reshuffle - Sakshi

చైనా కమ్యూనిస్ట్‌ పార్టీకి జిన్‌పింగ్‌ పిలుపు   

బీజింగ్‌: రాబోయే కాలంలో అతిపెద్ద పోరాటాలకు, ఊహించని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు కమ్యూనిస్ట్‌ పార్టీ ఇప్పటినుంచే సంసిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా వ్యవహరించాలని సూచించారు.

చైనా నేషనల్‌ డే సందర్భంగా ఖిషీ పత్రికలో జిన్‌పింగ్‌ ఈ మేరకు ఓ వ్యాసం రాశారు. సవాళ్లను ప్రభావవంతంగా అధిగమించే దిశగా ప్రజలను ముందుకు నడిపించాలని పేర్కొన్నారు. అధికార కమ్యూనిస్ట్‌ పార్టీ కీలక సదస్సు ఈ నెల 16న జరగనుంది. జిన్‌పింగ్‌ పదవీ కాలాన్ని వరుసగా మూడోసారి మరో ఐదేళ్లపాటు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మావో జెడాంగ్‌ తర్వాత పదేళ్లకుపైగా అధికారంలో ఉన్న నాయకుడిగా జిన్‌పింగ్‌ రికార్డు సృష్టిస్తారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top