breaking news
Major reshuffle
-
ఉక్రెయిన్ ప్రధాని యూలియా రాజీనామా
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తన ప్రభుత్వంలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మహిళా ప్రధాని యూలియా స్విరిడెంకో ఆదివారం రాజీనామా చేశారు. రష్యాతో యుద్ధం కొనసాగుతుండటంతో పదవీ కాలం ముగిసినప్పటికీ రాజ్యాంగం ప్రకారం జెలెన్స్కీ పదవిలో కొనసాగుతున్నారు. గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో యూలియా అమెరికాతో ఖనిజ ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో కీలకంగా వ్యవహరించారు. ఈ ఒప్పందం తర్వాత ఆమె 2025 జూలైలో తన 39వ ఏట ప్రధానిగా నియమితులయ్యారు. తనకు మరింత కీలకమైన పదవిని ఇస్తానంటూ జెలెన్స్కీ వాగ్దానం చేసినట్లు రాజీనామా అనంతరం యూలియా సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే, ఆ పదవి వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఉక్రెయిన్ రాజకీయ వ్యూహాన్ని మార్చుకుంటోందంటూ యూలియా స్విరిడెంకో రాజీనామా నేపథ్యంలో జెలెన్స్కీ ప్రకటించడం గమనార్హం. ముఖ్యమైన అంతర్జాతీయ భాగస్వామి దేశంతో సంబంధాలను మెరుగుపర్చుకునే విషయంలో ఆమెకు అత్యంత కీలకంగా వ్యవహరించే అవకాశం కల్పిస్తామన్నారు. ప్రభుత్వంలోని ఇతర విభాగాల్లోనూ భారీగా మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంధన మంత్రి డెనిస్ ష్మిహాల్, అంతర్గత శాఖ మంత్రి ఇహోర్ క్లిమెంకో, రక్షణ మంత్రి మైఖెయిలో ఫెదొరొవ్తో వేర్వేరుగా సమావేశమయ్యారు. కాగా, రష్యా దురాక్రమణ మొదలైన తర్వాత నాలుగేళ్లలో ఇది నాలుగో కీలక ప్రక్షాళన కానుంది. -
పోరాటాలకు సిద్ధం కావాలి
బీజింగ్: రాబోయే కాలంలో అతిపెద్ద పోరాటాలకు, ఊహించని ప్రమాదాలను ఎదుర్కొనేందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటినుంచే సంసిద్ధంగా ఉండాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా వ్యవహరించాలని సూచించారు. చైనా నేషనల్ డే సందర్భంగా ఖిషీ పత్రికలో జిన్‌పింగ్ ఈ మేరకు ఓ వ్యాసం రాశారు. సవాళ్లను ప్రభావవంతంగా అధిగమించే దిశగా ప్రజలను ముందుకు నడిపించాలని పేర్కొన్నారు. అధికార కమ్యూనిస్ట్ పార్టీ కీలక సదస్సు ఈ నెల 16న జరగనుంది. జిన్‌పింగ్ పదవీ కాలాన్ని వరుసగా మూడోసారి మరో ఐదేళ్లపాటు పొడిగించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మావో జెడాంగ్ తర్వాత పదేళ్లకుపైగా అధికారంలో ఉన్న నాయకుడిగా జిన్‌పింగ్ రికార్డు సృష్టిస్తారు. -
కోకాకోలాకు వెంకటేష్ రాజీనామా, కీలక పరిణామం
ముంబై: దేశంలో ఇటీవల ఇబ్బందుల్లో పడిన కోకాకోలా ఇండియా యాజమాన్యంలో కీలక మార్పును చేపట్టింది. అట్లాంటా, యుఎస్ఎలో కొనసాగుతున్న నాయకత్వ మార్పులకు అనుగుణంగా, గ్లోబల్ పానీయాల దిగ్గజం కోకాకోలా భారతదేశంలో కూడా నాయకత్వాన్ని మార్చింది. హిందుస్థాన్ కోకా కోలా సీఈవో టి. కృష్ణకుమార్‌ను సౌత్ వెస్ట్ ఆసియా బిజినెస్ హెడ్‌గా నియమించింది. ప్రస్తుత ప్రెసిడెంట్ వెంకటేష్ కిని రాజీనామా చేయడంతోఈ ఆదేశాలు మే 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ ప్రకటించింది. కోకాకోలా ఇండియా ప్రస్తుత ప్రెసిడెంట్ వెంకటేష్ కినీ తన పదవికి రాజీనామా చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే 2012 సం.రనుంచి దాదాపు 19 సం.లపాటు సంస్థకు సేవలందించిన వెంకటేష్ కిని వ్యక్తిగత కారణాల రీత్యా రిజైన్ చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం తాను తిరిగి అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అటు కృష్ణకుమార్ స్థానంలో హిందుస్థాన్ కోకా కోలా బేవరేజెస్ సీఈవో గా క్రిష్టినా రగ్గిరోను ఎంపిక చేసింది. ఆమె హెచ్‌సీసీబీకి మొదటి మహిళా సీఈవో కానున్నారు. కాగా త రెండు సంవత్సరాల్లో దేశంలో కోక్ విక్రయాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గడిచిన తొమ్మిది త్రైమాసికాల్లో నాలుగింటితో పాటు ప్రతికూల వాల్యూమ్ విక్రయాలు, కీ వేసవి నెలలు కూడా ఉన్నాయి. వినియోగదారుల ప్రాధాన్యతలను మార్చడంతో, ఇటీవల దాని ప్రధాన ప్రాంతానికి బయట ఉన్న పోర్ట్‌ఫోలియోలను కార్బొనేటేడ్ పానీయాలు విస్తరించడం పై కేంద్రీకరించింది. భారతీయ వినియోగదారుల్లో రసాలపై పెరుగుతున్న ప్రజాదరణను క్యాష్ చేసుకునేందుకు 2017 లో దేశంలో పళ్లరసాలను ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్న సంగతి తెలిసిందే.


