బిడ్డను కంటే రూ.12 లక్షలిస్తాం | China Plans Cash Rewards To Boost Birthrate | Sakshi
Sakshi News home page

బిడ్డను కంటే రూ.12 లక్షలిస్తాం

Jul 5 2025 8:16 AM | Updated on Jul 5 2025 10:20 AM

China Plans Cash Rewards To Boost Birthrate

జనాభాను పెంచుకునేందుకు చైనా కొత్త ప్లాన్‌

బీజింగ్‌: జననాల రేటు ఏటికేడు పడిపోతుండటంపై చైనాలోని కమ్యూనిస్ట్‌ ప్రభుత్వానికి బెంగపట్టుకుంది. ఇదే కొనసాగితే భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని భయపడుతోంది. అందుకే, కొత్త పథకంతో ముందుకు వచ్చింది. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ తర్వాత పుట్టే ప్రతి బిడ్డకు నెలకు 3,600 యువాన్లు(సుమారు రూ.42 వేలు) అందిస్తామని ప్రకటించింది.

ఆ చిన్నారి తల్లిదండ్రులకు ఇలా మూడేళ్లపాటు మొత్తం రూ.12 లక్షలను చెల్లిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన పథకంపై భారీ ఎత్తున ప్రచారం చేస్తోందని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. చైనా ప్రభుత్వం దశాబ్దాలపాటు కొనసాగించిన ఒకే సంతానం విధానానికి 2016లో ముగింపు పలికింది. ఆ తర్వాత కూడా దంపతులు ఒకరికి మించి సంతానాన్ని కనేందుకు మొగ్గు చూపక పోవడంతో చైనా ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement