సింహాన్ని పరుగులు పెట్టించిన చీతా..

Cheetah Attack On Lion In Kenya Masai Mara National Park - Sakshi

నైరోబి:  అడవికి రారాజు సింహం. అలాంటి సింహాన్ని సైతం పరుగులు పెట్టించిందో చీతా. విషయమేమిటంటే.. ఈ సింహానికి కొంతదూరంలో చీతా, దాని పిల్లలు కనిపించాయి. ఈ మధ్యాహ్నం భోజనం దొరికినట్లేననుకున్న సింహం... పిల్లల నుంచి తల్లిని వేరు చేసేందుకు ప్రయత్నించింది. తనకంటే మూడు రెట్లు పెద్దదైన సింహాన్ని చూసి భయపడి మొదట పారిపోయే ప్రయత్నం చేసిందీ చీతా.

ఎప్పుడైతే సింహం... తన పిల్లలను తినడానికి ప్రయత్నించిందో.. ఆ అమ్మ ఆదిశక్తిగా మారింది.. తిరగబడింది.. ఊహించని పరిణామంతో సింహం వెనక్కి తగ్గింది. కాళ్లకు పనిచెప్పింది. కెన్యాలోని మాసై మారా నేషనల్‌ రిజర్వ్‌ ఫారెస్టులోని ఈ దృశ్యాలను తన కెమెరాతో బంధించాడో ఫొటోగ్రాఫర్‌.    

చదవండి: ఆ ఇంట పాములు బాబోయ్‌ పాములు.. చూస్తే చెమటలు పట్టాల్సిందే!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top