వారి వల్ల కెనడా పేరు దెబ్బతింటోంది: భారత సంతతి ఎంపీ | Chandra Arya Serious Comments Over Khalistanis In Canada | Sakshi
Sakshi News home page

వారి వల్ల కెనడా పేరు దెబ్బతింటోంది: భారత సంతతి ఎంపీ

Jul 25 2024 7:11 AM | Updated on Jul 25 2024 8:54 AM

Chandra Arya Serious Comments Over Khalistanis In Canada

అట్టావా: ఖలిస్తానీ వేర్పాటులపై కెనడాలో భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య సంచలన ఆరోపణలు చేశారు. ఖలిస్తానీవాదుల కారణంగా కెనడా కలుషితమవుతోందని అన్నారు. ఇదే సమయంలో ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.

కాగా, చంద్ర ఆర్య తాజాగా కెనడాలో మాట్లాడుతూ..‘భారతీయులమైన మేము కెనడాకు వచ్చి స్థిరపడ్డాం. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాలు తిరిగి వచ్చి ఇక్కడికి చేరుకున్నాం. కెనడా మా స్వస్థలం. కెనడా సామాజిక-ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించాం. మా సేవలు కొనసాగుతూనే ఉంటాయి. వారసత్వంతో కెనడా బహుళ సంస్కృతిక సంప్రదాయాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాం. ఈ క్రమంలో కెనడా ఇచ్చిన హక్కులను ఖలీస్తాని మద్దతుదారులు దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటి వారి కారణంగా కెనడా నేల కలుషితమవుతోంది’ అంటూ మండిపడ్డారు.

 

 ఇదే సమయంలో ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు చేసిన దాడిపై చంద్ర ఆర్య స్పందించారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. దేవాలయాలపై దాడులు చేయడం సరికాదన్నారు. మరోవైపు.. ఎడ్మంటన్‌ నగరంలోని బాప్స్‌ స్వామినారాయణ మందిరంపై దాడిని, విద్వేషపూరిత రాతలను ఎడ్మంటన్‌ పార్లమెంటు సభ్యులు తప్పుబట్టారు. ఈ దాడి ఘటనను వాంకోవర్‌లోని భారత కాన్సుల్‌ జనరల్‌ కూడా తీవ్రంగా ఖండించారు. ఇదిలా ఉండగా.. గతేడాది కూడా కెనడాలోని మూడు దేవాలయాలపై ఇలాంటి దాడులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, కెనడాలో దేవాలయాలపై దాడిని అక్కడి భారత సంతతి వ్యక్తులు ఖండించడంతో చంద్ర ఆర్య, మిగతా వారు కెనడాను విడిచిపెట్టి భారత్‌కు వెళ్లిపోవాలని గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హెచ్చరించిన వీడియోను ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement