కృత్రిమ తీపితో క్యాన్సర్‌! | Sakshi
Sakshi News home page

కృత్రిమ తీపితో క్యాన్సర్‌!

Published Fri, Jun 30 2023 5:13 AM

Cancer Concerns Over One Of World Most Popular Artificial Sweeteners - Sakshi

వాషింగ్టన్‌: కూల్‌ డ్రింకులు తదితర బేవరేజెస్‌ల్లో నాన్‌ షుగర్‌ స్వీటెనర్‌(ఎన్‌ఎస్‌ఎస్‌)ల వాడకంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటిని వాడటం మానేయాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) మే నెలలో కొత్తగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రపంచంలో అత్యంత సాధారణంగా వాడే కృత్రిమ స్వీటెనర్‌లలో ఒకటైన ఆస్పర్టెమ్‌తో క్యాన్సర్‌ ప్రమాదం ఉన్నదంటూ తాజాగా పరిశోధనలో తేలడంతో దీని వినియోగంపై అమెరికాలో సమీక్ష మళ్లీ మొదలైందని వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం పేర్కొంది.

అత్యంత విరివిగా వాడే కృత్రిమ షుగర్‌ పదార్థం ఒకటి క్యాన్సర్‌కు కారకంగా మారే అవకాశం ఉందని వచ్చే నెలలో డబ్ల్యూహెచ్‌వో క్యాన్సర్‌ రీసెర్చ్‌ ఏజెన్సీ ప్రకటించనుందంటూ రాయిటర్స్‌ తెలిపింది. ఆస్పర్టెమ్‌ను వాడొచ్చంటూ అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మిని్రస్టేషన్‌(ఎఫ్‌డీఏ) 1981లోనే అనుమతులిచి్చంది. అయిదేళ్లకోసారి ఈ అనుమతిని సమీక్షిస్తూ వస్తోంది. భారత్‌ సహా 90కి పైగా దేశాల్లో అస్పర్టెమ్‌ వినియోగంలో ఉంది.

ఆస్పర్టెమ్‌లో ఎలాంటి కేలరీలు ఉండవు. చక్కెర కంటే సుమారు 200 రెట్లు తీపిని ఇది కలిగిస్తుంది. ఆస్పర్టెమ్‌ను వినియోగించేందుకు 2009లో భారత ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ రెగ్యులేషన్‌ సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) అనుమతినిచి్చంది.  ఆస్పర్టెమ్‌ను  95% కార్పొనేటెడ్‌ సాఫ్ట్‌ డ్రింకుల్లో స్వీటెనర్‌గా వాడుతున్నారు. బేవరేజెస్‌ మార్కెట్‌ షేర్‌లో అతిపెద్దదైన రెడీ టూ డ్రింక్‌ టీల్లో 90% వరకు వినియోగిస్తున్నారు. మిగతా స్వీటెనర్లతో పోలిస్తే ఆస్పర్టెమ్, అసెసల్ఫేమ్‌–కె అనే వాటి వాడకంతో క్యాన్సర్‌ ప్రమాదం కాస్త ఎక్కువేనంటూ గతేడాది ఫ్రాన్సులో  చేపట్టిన ఓ అధ్యయనంలో తేలింది.  

Advertisement
 
Advertisement
 
Advertisement