ఆగస్టు కల్లా మాది కరోనా ఫ్రీ దేశం

Britain Free Of Covid August Vaccine Task Force Chief - Sakshi

లండన్‌: గత సంవత్సర కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లాడిస్తోంది. ఇటీవలే కొన్ని దేశాలు ఈ వైరస్‌ బారినుంచి మెల్లగా కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు నాటికి బ్రిటన్ లో కరోనా వైరస్ అంతమైపోతుందని ఆ దేశ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్‌గా రిటైరవుతున్న క్లైవ్ డిక్స్ చెప్పారు. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా తెలిపారు.2022 తొలి మాసాల్లో వ్యాక్సిన్ బూస్టర్ ప్రోగ్రాంను బ్రిటన్‌ ప్రభుత్వం చేపట్టబోతోంది. కరోనాను ఎదుర్కోవడం‍లో అందరి శరీరాల్లో యాంటీబాడీలు ఒకేలా పని చేయవు, కనుక అటువంటి వారి కోసం బూస్టర్ షాట్ ను అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.

అలాగే జూలై చివరిలోగా బ్రిటన్‌ ప్రజలకు కనీసం ఒక్క డోసు వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు  ఇప్పటి వరకు బ్రిటన్‌లో 5 కోట్ల పైగా టీకాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే సగం మంది వయోజనులకు మొదటి డోసు ఇచ్చిన రెండవ దేశంగా బ్రిటన్ రికార్డు సృష్టించింది. రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉన్నందున 40 ఏళ్లలోపు వారికి ఆక్స్ఫర్డ్ / ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు ప్రత్యామ్నాయ వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు బ్రిటిష్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఫైజర్, మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్ల వైపు అధికారులు మొగ్గు చూపుతున్నారు. డిసెంబర్‌లో టాస్క్‌ఫోర్స్‌కు తాత్కాలిక నాయకుడిగా నియమితులైన డిక్స్ గత వారం తన పదవి నుంచి వైదొలిగారు.

( చదవండి: Handling Covid Situation: ఓకే.. నాట్‌ ఓకే..! )

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top