Bride Video: వరుడిని అక్కడ కొట్టేసి.. చుట్టూ పరిగెత్తి.. చివర్లో ‘ఆర్‌ యూ ఓకే బేబీ’

Bride Hits Bride Groom Accidently With Rounders Ball England Goes Viral - Sakshi

పెళ్లయిన తరువాత వధూవరుల మధ్య చనువు పెంచటానికి వారితో ఆటలు ఆడించటం మామూలే. ఆటలంటే మనకి తెలిసి.. బిందెలో ఉంగరం వేసి తీయడం.. పూల బంతితో ఆట లాంటి నాజూకువి ఉంటాయి. అయితే బయట దేశాల్లో అలా కాదు మైండ్‌లో ఫిక్స్‌ అయితే బ్లైండ్‌గా వెళ్తుంటారు. అలా ఓ కొత్త జంట ఆడిన ఆట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఆ జంట ఏ ఆట ఆడారంటే... 

 కొద్ది రోజుల క్రితం ఇంగ్లాండ్‌లోని కార్లియాన్‌ బే హోటల్‌ గార్డెన్‌లో వధూవరులు రౌండర్స్‌ బాల్‌ ఆడారు. మొదటగా పెళ్లి కుమారుడు మ్యాట్‌ చెస్టర్‌ఫీల్డ్‌ బాల్‌ వేయగా, పెళ్లి కుమార్తె సారా చెస్టర్‌ఫీల్డ్‌ దాన్ని బ్యాట్‌తో కాస్త గట్టిగానే కొట్టింది. అది నేరుగా వెళ్లి వరుడి ప్రైవేటు భాగంలో తగిలింది. అంతే మనోడు కుప్పకూలి కిందపడి గిలగిల్లాడసాగాడు.

ఈ సీన్‌ చూస అక్కడి వాళ్లు పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. పాపం మ్యాట్‌కు దెబ్బ తగలిందన్న విషయం వధువుకి తెలియక.. నవ్వుకుంటూ, గెలుపుకోసం చుట్టూ పరిగెత్తింది. కార్నిష్ వీడియోగ్రాఫర్ గ్రాంట్ అలెగ్జాండర్‌ ఈ సీన్ని తన కెమారాలో బంధించగా, వధువు సోదరి హేలీ మెక్‌డొనాల్డ్ వీడియోను టిక్‌టాక్‌కు షేర్ చేసింది. పక్కనున్న వాళ్లు అతడి దగ్గరకి వచ్చి ఓదార్చారు.

ఆ కొద్దిసేపటి తర్వాత వధువు కూడా వరుడి దగ్గరకు వచ్చి.. ఆర్‌ యూ ఓకే బేబీ అంటూ ఓదార్చింది.  కానీ అప్పటికే అతడి ముఖం బాధతో ఎర్రగా మారిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.

చదవండి: వైరల్‌: వీడెవ‌డ్రా బాబు.. నాకే పోటీగా వచ్చేలా ఉన్నాడు..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top