బర్మింగ్‌హమ్‌ లార్డ్‌ మేయర్‌గా బ్రిటిష్‌ ఇండియన్‌ | Sakshi
Sakshi News home page

బర్మింగ్‌హమ్‌ లార్డ్‌ మేయర్‌గా బ్రిటిష్‌ ఇండియన్‌ చమన్‌ లాల్‌

Published Tue, May 30 2023 6:00 AM

Birmingham gets first British Indian Lord Mayor - Sakshi

లండన్‌: ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హమ్‌ నగర లార్డ్‌ మేయర్‌గా బ్రిటిష్‌–ఇండియన్‌ కౌన్సిలర్‌ చమన్‌లాల్‌ ఎన్నికయ్యారు. తద్వారా బర్మింగ్‌హమ్‌ తొలి బ్రిటిష్‌–ఇండియన్‌ మేయర్‌గా ఆయన రికార్డు సృష్టించారు.

సిక్కు మతంలోని రవిదాసియా వర్గానికి చెందిన చమన్‌ లాల్‌ భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రం హోషియార్‌పూర్‌ జిల్లాలోని పఖోవాల్‌ గ్రామంలో జన్మించారు. బ్రిటిష్‌ ఇండియా సైన్యంలో పనిచేసిన ఆయన తండ్రి సర్దార్‌ హర్నామ్‌సింగ్‌ బంగా 1954లో ఇంగ్లాండ్‌కు వలస వచ్చారు. బర్మింగ్‌హమ్‌లో స్థిరపడ్డారు. చమన్‌లాల్‌ 1964లో తన తల్లి సర్దార్నీ జై కౌర్‌తో కలిసి ఇంగ్లాండ్‌కు చేరుకున్నారు. అప్పటి నుంచి బర్మింగ్‌హమ్‌లోనే నివసిస్తున్నారు.

చమన్‌ లాల్‌ 1971లో విద్యావతిని వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజకీయాలపై ఆసక్తితో చమన్‌లాల్‌ 1989లో లేబర్‌ పార్టీలో చేరారు. అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా జరిగిన సామాజిక పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement