పొట్టకూటి కోసం వెెళితే.. రూ. 52 కోట్ల లాటరీ | bahrain based malayali wins 20 million dhirams | Sakshi
Sakshi News home page

పొట్టకూటి కోసం వెెళితే.. రూ. 52 కోట్ల లాటరీ

Jun 4 2026 4:16 PM | Updated on Jun 4 2026 4:29 PM

 bahrain based malayali wins 20 million dhirams

మనామా: ఆ భారతీయుడు పొట్టకూటి కోసం బహ్రెయిన్‌ వెళ్లాడు. ఆ దేశంలో చిన్నచితకా వ్యాపారాలు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నాడు. అయితే అంతలోనే ఆ చిరువ్యాపారిని అదృష్టలక్ష్మీ వరించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ. 52 కోట్ల లక్కీడ్రాలో అతనికి దక్కింది. దీంతో ప్రవాస భారతీయుడు ఆనందంతో ఉబ్బితబ్బయ్యాడు.

కేరళ త్రిసూర్‌కు చెందిన కృష్ణకుమార్ అనే వ్యక్తి గత 23 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం బహ్రెయిన్‌కు వెళ్లాడు. అప్పటి నుండి అక్కడ పలురకాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఏలాగైనా తన జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని భావించిన కృష్ణకుమార్ లాటరీ టికెట్లను కొనడం ప్రారంభించాడు. అప్పటి నుంచి తరచుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అయితే ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆయన కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌ బంఫర్‌ డ్రాలో రూ. 52 కోట్ల ఫ్రైజ్‌మనీ గెలుచుకుంది. 

దీంతో బహ్రెయిన్‌ కరెన్సీ ప్రకారం రూ. రెండు కోట్ల దిర్హమ్‌లు ( రూ. 52 కోట్ల) రుపాయల ఫ్రైజ్‌మనీ గెలుచుకున్నారు. అయితే తను కొన్న టికెట్‌ లక్కీడ్రాలో ఎంపికవడంతో నిర్వాహకులు తనకు ఫోన్‌ చేశారని ఆసమయంలో తన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ ఉందని కృష్ణకుమార్ తెలిపారు. అయితే ఇన్నేళ్లుగా తన స్నేహితులతో కలిసి లాటరీ టికెట్లు కొనేవాడినని ఇప్పుడు స్వంతంగా టికెట్‌ కొనడం దానికి లాటరీ తాకడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

ఇంతపెద్దమెుత్తంలో డబ్బు చూడడం ఇదే తొలిసారని బహుమతి డబ్బులతో ఏం చేయాలనే విషయం తన కుటుంబసభ్యులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటానని కృష్ణకుమార్ అన్నారు. అయితే ఈ లాటరీలో మెుదటి బహుమతి 25 మిలియన్ల దిర్హమ్‌లు కాగా ఐదుగురికి ఒక మిలియన్, లగ్జరీ కార్లు బహుమతులుగా ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement