విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా ‘అలీబాబా’ జాక్‌ మా

Alibaba group Jack Ma joins Japan Tokyo College as visiting professor - Sakshi

టోక్యో: చైనా ఈ–కామర్స్‌ దిగ్గజం అలీబాబా గ్రూప్‌ సహ వ్యవస్థాపకుడు జాక్‌ మా కాలేజీ ప్రొఫెసర్‌గా మారనున్నారు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీ ఆఫ్‌ టోక్యోకు చెందిన పరిశోధన సంస్థ టోక్యో కాలేజీలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌ కానున్నారు.

సుస్థిర వ్యవసాయం, ఆహారోత్పత్తి అంశంపై ఆయన పరిశోధనలు చేస్తారని వర్సిటీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎంట్రప్రెన్యూర్‌షిప్, కార్పొరేట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర రంగాల్లో తన అనుభవాన్ని విద్యార్థులు, అధ్యాపకులతో జాక్‌ మా పంచుకుంటారని తెలిపింది. 1990ల్లో ఈ– కామర్స్‌ సంస్థ అలీబాబాను స్థాపించిన జాక్‌ మా ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనికుడు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top