చాథమ్ తీరంలో 100 తిమింగలాలు మృతి

100 Whales Dead In New Zealand After Mass Stranding - Sakshi

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ తూర్పు తీరానికి 800 కిలోమీటర్ల (497 మైళ్ళు) దూరంలో ఉన్న చాథమ్ దీవులలో సుమారు 100  పైలట్ తిమింగలాలు, బాటిల్‌నోస్‌ డాల్ఫిన్‌లు చనిపోయినట్లు బుధవారం మెరైన్‌ అధికారులు తెలిపారు. ఈ ద్వీపం మారుమూల ప్రదేశంలో చిక్కుకున్న కారణంగా తక్షణ సహాయక చర్యలు చేపట్టలేకపోయామని అన్నారు. మొత్తం 97 పైలట్ తిమింగలాలు, 3 డాల్ఫిన్‌లు తీవ్ర అవస్థలు పడుతూ మరణించిన విషయం తమకు ఆదివారం తెలిసిందని న్యూజిలాండ్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ కన్జర్వేషన్ (డీఓసీ) తెలిపింది.    (ఉటా ఎడారిలో మిస్టరీ దిమ్మె!)

'ఇంకా అక్కడ 26 తిమింగలాలు మాత్రమే సజీవంగా ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం చాలా బలహీనంగా కనిపిస్తున్నాయి. సముద్రంలో చోటుచేసుకున్న పరిస్థితుల కారణంగా అవి అస్వస్థతకు గురయ్యాయి. సముద్రంలో గొప్ప తెల్ల సొరచేపలు కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి' అని బయోడైవర్శిటీ రేంజర్ జెమ్మ వెల్చ్ అన్నారు. చాథమ్ దీవులలో జంతువులు గుంపులుగా ఉండటం సర్వసాధారణం. చాథమ్ ఐలాండ్ లో 1918లో అత్యధికంగా 1000కి పైగా తిమింగలాలు ఒడ్డుకు కొట్టుకురావడమే చరిత్రలో భారీ ఘటన. కాగా చివరగా 1985లో 450కి పైగా వేల్స్ ఆక్లాండ్ లో ఇదే రీతిలో తీరానికి వచ్చాయి. అయితే ఇప్పుడు మరలా అదే పునరావృతం కావడంతో.. ఇలా ఎందుకు జరుగుతుంది? అనే ప్రశ్న సముద్ర జీవశాస్త్రజ్ఞులను కలవరపెడుతోంది. కాగా, సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియన్ తీరంలో సామూహికంగా నివశించే అనేక వందల తిమింగలాలు మరణించిన సంగతి తెలిసిందే.

 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top