
మాజీ కార్పొరేటర్ శంకర్ సేవలు మరువలేనివి
గౌలిపురా: గౌలిపురా మాజీ కార్పొరేటర్, దివంగత శంకర్ చేసిన సేవలు మరువలేనివని శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత, శ్రీ కోట మైసమ్మ ఆలయ కమిటీ అధ్యక్షుడు ఎర్మనీ కై లాష్ గంగపుత్ర అన్నారు. గౌలిపురాలోని ఆరె కటిక సంఘంలో దివంగత నేత, మాజీ కార్పొరేటర్ కె.శంకర్ సంతాప సభను నిర్వహించారు. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆలయ కమిటీ ప్రతినిధులతో కలిసి శంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కై లాష్ మాట్లాడుతూ..శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత, శ్రీ కోట మైసమ్మ ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడిగా, వీఎస్‌టీ కంపెనీలో బీఎంఎస్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా, ఉమ్మడి దేవాలయాల కమిటీ మాజీ అధ్యక్షుడిగా, కార్పొరేటర్‌గా కె.శంకర్ ఎనలేని సేవలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు ఆలె భాస్కర్ రాజ్, గౌలిపురా కార్పొరేటర్ ఆలె భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్ పాశం సురేందర్, ఆలే జితేంద్ర, చర్మాణి రూప్‌రాజ్, ఆలయ కమిటీ ముఖ్య సలహాదారులు ఎస్.మల్లేషం గౌడ్, కె.జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కె.ఎస్.ఆనంద్ రావు, ఆదర్ల మహేశ్, ఉప్పుగూ డ మహంకాళి ఆలయ కమిటీ అధ్యక్షులు మధుసూ దన్ గౌడ్, మోకాళ్ల వెంకటేశ్, శివరత్నం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment