బంజారాహిల్స్‌: ఆలివర్‌ లేక్‌ స్పాలో వ్యభిచారం | - | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌: ఆలివర్‌ లేక్‌ స్పాలో వ్యభిచారం

May 13 2023 9:02 AM | Updated on May 13 2023 9:31 AM

- - Sakshi

హైదరాబాద్: ఫిలింనగర్‌ రోడ్‌ నెం–9లోని ప్లాట్‌ నెంబర్‌ సి–12లో కొంత కాలంగా ఆలివర్‌ లేక్‌ స్పా పేరుతో ఓ వ్యక్తి స్పా నిర్వహిస్తున్నాడు. అయితే స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా క్రాస్‌ మసాజ్‌ చేస్తూ ఈజీమనీకి అలవాటు పడినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. బంజారాహిల్స్‌ ఎస్‌ఐ హరీశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఈ మసాజ్‌ సెంటర్‌పై దాడులు నిర్వహించగా ఇందులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు.

వివిధ ప్రా ంతాల నుంచి యువతులను మసాజ్‌ థెరపిస్ట్‌ల పేరుతో రప్పిస్తూ వ్యభిచారానికి పాల్పడుతున్నట్లుగా తేలింది. నిబంధనలకు విరుద్ధంగా స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న మేనేజర్‌ సుమంత్‌, యజమాని సోమాకమల్‌పై పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. స్పాను సీజ్‌ చేశారు. మసాజ్‌ థెరపిస్ట్‌ల పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న యువతులకు రూ. 21వేల చొప్పున, కస్టమర్ల నుంచి రూ. 2 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement