డ్రోన్‌ పిచికారీతో దోమల నివారణ | - | Sakshi
Sakshi News home page

డ్రోన్‌ పిచికారీతో దోమల నివారణ

Nov 19 2026 1:13 AM | Updated on Nov 19 2026 1:13 AM

డ్రోన్‌ పిచికారీతో దోమల నివారణ

ప్రారంభించిన బల్దియా కమిషనర్‌ వెంకన్న

వరంగల్‌ అర్బన్‌: డ్రోన్‌తో దోమల నివారణకు బల్దియా ప్రణాళిక చేపట్టింది. ప్రజారోగ్య పరిరక్షణ లో భాగంగా ఆధునిక సాంకేతిక డ్రోన్‌తో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయనున్నారు. బుధవారం నయీంనగర్‌ నాలా వద్ద బల్దియా కమిషనర్‌ టి.వెంకన్న ప్రారంభించారు. మహానగర వ్యాప్తంగా ఉన్న నాలాలపై పిచికారీ చేసేందుకు ప్రణాళిక కార్యచరణ రూపొందించారు. కమిషనర్‌ వెంట సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, అర్బన్‌ మలేరియా అధికారి రజిని, సూపర్‌వైజర్‌ అనిల్‌, హెల్త్‌ అసిస్టెంట్లు, మలేరియా విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్ల పరిశీలన

కాజీపేట రూరల్‌: కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదాల నివారణకు పటిష్టమైన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి.వెంకన్న అధికారులకు సూచించారు. కాజీపేట మండలంలోని అయోధ్యపురం–మడికొండ శివారు ప్రాంతంలో త్వరలో ప్రారంభం కానున్న కాజీపేట రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ (ఆర్‌ఎంయూ)లో బుధవారం ఏర్పాటు చేసిన ఫైర్‌సేప్టీ పరికరాలు, అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో కమిషనర్‌ పరిశీలించారు. కమిషనర్‌ వెంట బల్దియా ఫైర్‌సేఫ్టీ అధికారి రాజేశ్వర్‌, ఎంహెచ్‌ఓ రాజేశ్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement