హన్మకొండ అర్బన్: క్షయ వ్యాధి రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య అన్నారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయంలో 15 మంది క్షయ వ్యాధి బాధితులకు నిక్షయ్ పోషణ కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్‌వైజర్ మల్లేశం 10 నిక్షయ్ పోషణ కిట్లు అందించేందుకు ముందుకు రావడాన్ని డాక్టర్ అప్పయ్య అభినందించారు. టి సాక్స్ రాష్ట్ర ఉప సంచాలకురాలు డాక్టర్ ఇందిర, అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి మదన్‌మోహన్, ఉప వైద్యారోగ్య శాఖ అధికారి, ఇన్‌చార్జ్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ ప్రదీప్‌రెడ్డి, జిల్లా రోగ నిరోధక అధికారి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
హన్మకొండ అర్బన్: హెచ్‌ఐవీ, ఎయిడ్స్ నివారణ, నియంత్రణలో నిర్దేశించిన 95–95–95 లక్ష్యాలను సాధించినందుకు హనుమకొండ జిల్లాకు ప్రతిష్టాత్మక సురక్షిత్ జిల్లా గుర్తింపు లభించింది. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌ని తెలంగాణ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఇందిర శాలువా, జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో మరింత కృషి చేసి సురక్షిత్ ప్లస్ స్థాయిని సాధించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ అప్పయ్య, వైద్యాధికారులు మదన్ మోహన్‌రావు, డాక్టర్ సూర్యప్రకాశ్, ప్రసాద్, స్వప్న మాధురి, రామకృష్ణ, కమలాకర్, సురేశ్, శిరీష పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు నిత్యజీవితానికి సవాల్‌గా మారాయని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగం అధ్యాపకుడు, పరిశోధకుడు డాక్టర్ బండెల విష్ణువర్ధన్ రచించిన ఫౌండేషన్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్‌క్రైం ఇన్వెస్టిగేషన్ గ్రంథాన్ని బుధవారం వీసీ ప్రతాప్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, ఓఎస్డీ ప్రొఫెసర్ బి.వెంకట్రాంరెడ్డి, కేయూ పాలకమండలి సభ్యులు ఆచార్య సురేశ్‌లాల్, చిర్ర రాజు, సైన్స్ విభాగాధిపతి డాక్టర్ వేణుగోపాల్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ మంజుల తదితరులు పాల్గొన్నారు.
కేయూ క్యాంపస్: కేయూలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల కోసం రూ.3 కోట్ల వ్యయంతో మూడు వర్క్‌షాప్ షెడ్ల నిర్మాణం, రూ.5 కోట్లతో క్యాంపస్‌లోని మహిళా హాస్టళ్లకు కలిపి ప్రహరీ నిర్మించనున్నారు. ఈమేరకు ఈనెల 19న కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రంతో కలిసి శంకుస్థాపన చేయనున్నట్లు కేయూ అభివృద్ధి అధికారి వెంకయ్య బుధవారం తెలిపారు. మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ కె.భిక్షాలు, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్, తెలంగాణ విద్య, మౌలిక సదుపాయాల సంస్థ ఇంజ నీర్లు అరుణ్‌కుమార్, నరేందర్‌రెడ్డి, కేయూ ఇంజనీర్ శంకరయ్య పాల్గొంటారని పేర్కొన్నారు.
కాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ కార్యాలయాన్ని డిసెంబర్ 1వ తేదీన ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే కాజీపేట సబ్ డివిజన్ పరిధి, విస్తరణ, కార్యాలయాలు, సిబ్బంది, అధికారులు, రైళ్ల సంఖ్య, ప్రయాణికుల సంఖ్య, రైల్వేస్టేషన్ల వివరాలను, రైల్వే పోలీస్‌స్టేషన్ల కార్యకలాపాలను పాలనాపరంగా వివరాలు రైల్వే శాఖ పరిగణనలోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొదట సబ్ డివిజన్ తర్వాత రైల్వే డివిజన్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కన్నారు. నాందేడ్, గుంతకల్ డివిజన్లు కూడా గతంలో ఇలా.. ఏర్పాటు చేసిన తర్వాతే అప్‌గ్రేడ్ చేసిన తరహాలో కాజీపేటకు అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఈనేపథ్యంలో.. డిసెంబర్ 1 నుంచి అడ్మినిస్ట్రేటివ్‌ను కొనసాగించే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.


