సంక్షేమానికి ప్రాధాన్యం : ఎంపీ కడియం కావ్య | - | Sakshi
Sakshi News home page

సంక్షేమానికి ప్రాధాన్యం : ఎంపీ కడియం కావ్య

Nov 19 2026 1:13 AM | Updated on Nov 19 2026 1:13 AM

సంక్షేమానికి ప్రాధాన్యం : ఎంపీ కడియం కావ్య అర్హులందరికీ సంక్షేమ ఫలాలు : ఎమ్మెల్యే నాగరాజు

హన్మకొండ అర్బన్‌: సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వరంగల్‌ ఎంపీ డాక్టర్‌ కడియం కావ్య అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బుధవారం హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 2,698 మందికి నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ వెంకన్నతో కలిసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. కాజీపేట డిప్యూటీ కమిషనర్‌ బిర్రు శ్రీనివాస్‌ తదితరులున్నారు.

హన్మకొండ: అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. బుధవారం హనుమకొండలోని అంబేడ్కర్‌ భవన్‌లో చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద, కుడా చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ వెంకన్నతో కలిసి ఎమ్మెల్యే కేఆర్‌.నాగరాజు చేయూత పింఛన్‌ మంజూరు పత్రాలు అందించారు. గ్రేటర్‌ పరిధి వర్ధన్నపేట నియోజకవర్గంలో మొత్తం 2,161 మందికి పత్రాలు అందించారు. బల్దియా ఇన్‌చార్జ్‌ అదనపు కమిషనర్‌ సమ్మయ్య, హనుమకొండ డీఆర్డీఓ మేన శ్రీను, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, బిర్రు శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement