పార్టీ రాష్ట్ర సహ సంఘటన మంత్రి దశరథ్
హన్మకొండ: రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోలింగ్ బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని బీజేపీ రాష్ట్ర సహ సంఘటన మంత్రి దశరథ్ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ హంటర్ రోడ్డులోని వేద బాంక్వెట్ హాల్‌లో పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ జిల్లా డివిజన్ అధ్యక్షులు, ఆపై స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి దశరథ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. నాయకులంతా క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. పార్టీ సంస్థాగత అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సమావేశంలో నాయకులు టి.రాజేశ్వర్ రావు, రావు పద్మ రెడ్డి, డాక్టర్ పగడాల కాళీప్రసాద్ రావు, చాడ స్వాతి రెడ్డి, పులి సరోత్తమ్ రెడ్డి, డాక్టర్ విజయ్‌చందర్ రెడ్డి, చాడ శ్రీనివాస్‌రెడ్డి, కన్నబోయిన రాజయ్య యాదవ్, దొంతి దేవేందర్ రెడ్డి, రావుల కిషన్, ఆర్పీ.జయంత్ లాల్, సండ్ర మధు, రాంబాబు, జిల్లా పదాధికారులు తదితరులు పాల్గొన్నారు.


