పారదర్శకంగా ఓటరు జాబితా | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా ఓటరు జాబితా

Nov 19 2026 1:13 AM | Updated on Nov 19 2026 1:13 AM

పారదర్శకంగా ఓటరు జాబితా

సీఈసీ కార్యదర్శి సుమన్‌ కుమార్‌ దాస్‌

హన్మకొండ అర్బన్‌: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితా రూపకల్పనను ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి పారదర్శకతతో చేపట్టాలని భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సుమన్‌ కుమార్‌దాస్‌ ఆదేశించారు. బుధవారం న్యూఢిల్లీలోని ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్‌్స్‌ నిర్వహించి ఓటరు నమోదు ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. హనుమకొండ కలెక్టరేట్‌ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్‌, ఆర్డీఓ వెంకటేశ్‌, తహసీల్దార్‌ రవీందర్‌రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ జగత్‌సింగ్‌ పాల్గొన్నారు.

బీమా పథకాన్ని విజయవంతం చేయాలి..

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పథకం ప్రారంభోత్సవ ఏర్పాట్లు, దరఖాస్తుల స్వీకరణ, ప్రచార కార్యక్రమాలపై సమీక్షించారు. కలెక్టర్‌ బాజ్‌పాయ్‌ హనుమకొండ ఐడీఓసీ నుంచి పాల్గొన్నారు.

భూసేకరణపై సమీక్ష

హనుమకొండ జిల్లా పరిధి గౌరవెల్లి ప్రాజెక్టు, కొత్త రైల్వే లైన్లు, గ్రేటర్‌ వరంగల్‌ నగరపాలక సంస్థకు సంబంధించిన నీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి చేపట్టనున్న భూసేకరణపై కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులకు సూచనలిచ్చారు.

అవగాహన కల్పించాలి..

విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులకు క్విజ్‌, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు కలెక్టర్‌ బహుమతులు అందజేశారు. బల్దియా కమిషనర్‌ వెంకన్న, హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్‌, కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, జీడబ్ల్యూఎంసీ సీపీఓ రవీంద్ర రాడేకర్‌, స్వీప్‌ నోడల్‌ అధికారి మోహన్‌, హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్‌, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ జగత్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి స్థల పరిశీలన

కాజీపేట జాగీరులోని ఇందిరమ్మ కాలనీలో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని హనుమకొండ కలెక్టర్‌ బుధవారం పరిశీలించారు. ఈసందర్భంగా టవర్స్‌ నిర్మాణం, నివాస యోగ్యత కు సంబంధించిన పలు అంశాలపై హౌసింగ్‌ శాఖ పీడీ, తహసీల్దార్‌ రాజుతో చర్చించారు. స్థలానికి సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement