బియ్యం ధరలు నియంత్రించాలి.. | - | Sakshi
Sakshi News home page

బియ్యం ధరలు నియంత్రించాలి..

Nov 19 2026 1:13 AM | Updated on Nov 19 2026 1:13 AM

బియ్యం ధరలు నియంత్రించాలి..

సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస్‌రావు

హన్మకొండ: నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, తక్షణమే బియ్యం ధరలను ప్రభుత్వం నియంత్రించాలని భారత కమ్యూనిస్ట్‌ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు డిమాండ్‌ చేశారు. సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈధర్నాలో తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజల ఆకలి కేకలను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈధర్నాలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సిరబోయిన కరుణాకర్‌, జిల్లా సహాయ కార్యదర్శి తోట భిక్షపతి, మండల కార్యదర్శి ఎన్‌.అశోక్‌ స్టాలిన్‌, నాయకులు గుంటి.రాజేందర్‌, అలకుంట్ల యాకయ్య, పొనుగోటి రాముగోపాలచారి, పూజారి అమృతయ్య, పొక్కు ల సదానందం, కోడెపాక బాబు, మామునూరి దామోదర్‌, నోముల కిశోర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement