హన్మకొండ: వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సన్నద్ధమవుతున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వేసవిలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా మౌలిక వసతులు ముందుగానే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని ప్రధాన కార్యాలయం నుంచి 18 సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజినీర్లు, డివిజనల్ ఇంజినీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవి కార్యాచరణ, ప్రణాళికపై సమీక్షించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో జనవరి నుంచే విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, ఈ మేరకు డిస్ట్రిబ్యూషన్, పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ముందుగానే గుర్తించి వాటి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణ పనుల్లో పురోగతిని వేగవంతం చేసి జనవరి లోపు వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో డైరెక్టర్లు వి.మోహన్ రావు, టి.మధుసూదన్, సి.ఈలు కె.తిరుమల్ రావు, సురేందర్, అశోక్, అన్నపూర్ణ, జీఎంలు తిరుపతి, ప్రభావతి, వాసుదేవ్, బాబూరావు, డి.ఈలు అనిల్ కుమార్, నాగరాజు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు చర్యలు
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి


