● దేవాదాయశాఖ ఐదో జోన్
డిప్యూటీ కమిషనర్ డి.కృష్ణప్రసాద్
హన్మకొండ కల్చరల్: భక్తులతో మర్యాదగా ప్రవర్తించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వేటు పడుతుందని దేవాదాయశాఖ ఐదో జోన్ డిప్యూటీ కమిషనర్ డి.కృష్ణప్రసాద్ హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం వేయిస్తంభాల దేవాలయాన్ని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆయనను ఆలయమర్యాదలతో ఘనంగా స్వాగతించారు. శ్రీరుద్రేశ్వరస్వామి వా రికి రుద్రాభిషేకం నిర్వహించుకున్న అనంతరం తీ ర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. దేవాలయ ప్రాంగణా న్ని పరిశీలించి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 23 రెండో సోమవారం, 24 కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని 19 జిల్లాల్లోని శైవ, వైష్ణవాలయాల్లో భక్తులకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. దేవాదాయశాఖ రెవెన్యూ అధికారిని సునీత, సర్వేయర్ అనిల్ పాల్గొన్నారు.


