పాలకుర్తి టౌన్: కన్నవారి కలలను నిజం చేయడానికి రూ.కోట్లు సంపాదించాల్సిన అవసరం లేదు.. మనస్సులో ప్రేమ, వారిని సంతోషపెట్టాలనే సంకల్పం ఉంటే చాలని నిరూపించాడు ఓ యువకుడు. తల్లిదండ్రులను విమానంలో ఎక్కించి వారి జీవి తంలో మరిచిపోలేని మధురానుభూతిని మిగిల్చా డు. పల్లెటూరి మట్టి వాసన, తన సహజమైన జీవనశైలిని ఏమాత్రం మార్చుకోని ఆ తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం చూసి కొడుకు మురిసిపోయా డు. వివరాలిలా ఉన్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన నిరుపే ద రైతు దంపతులు తోటకూరి నర్సయ్య, సమ్మక్క కుమారుడు సంజీవ హైదరాబాద్‌లో ప్రైవేట్ డీటీటీసీ కొరియర్ సర్వీసులో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులకు జీవితంలో ఒక్కసారైనా విమానప్రయాణం చేయించాలన్నది అతడి కోరిక. అయితే ఆ విషయాన్ని వారికి చెప్పకుండా ఓ సర్‌ప్రైజ్ చేయాలనుకున్నాడు. తిరుపతికి తీసుకెళ్తానని చెప్పి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లాడు. అక్కడినుంచి విమానంలో తిరుపతికి ప్రయా ణం చేయించి తల్లిదండ్రులను ఆశ్చర్యపరిచాడు. కాంచీపురం, మధురై తదితర పర్యాటక ప్రాంతా లను చూపించి అనందపరిచాడు. భుజాన కండువా.. ఒంటిపై తెల్ల పంచె.. చేతిలో పాత ఎర్ర బ్యా గు, తల్లి సమ్మక్క చేతిక ప్లాస్టిక్ కవర్ బ్యాగుతో వి మానం ఎక్కిన తీరు అందరిని అలరించింది. ఎర్రబస్సు ఎక్కినంత సహజంగా విమానంలోకి అడుగు పెట్టిన ఆ తల్లిదండ్రుల్లో ఎక్కడా బెరుకు కనిపించలేదు. కన్నవారి వేషధారణను చూసి మొహమాటపడే కొందరికి భిన్నంగా.. వారి సహజత్వమే త నకు గర్వకారణమని చాటాడు సంజీవ. తల్లిదండ్రు ల ఆనందమే తనకు అసలైన ఆస్తి అని భావించిన ఆ కొడుకు కథ ప్రతీ ఒక్కరి మనస్సును తాకుతోంది. తల్లిదండ్రులకు ఖరీదైన బహుమతులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. వారి ముఖంలో చిరునవ్వు పూయించే ఓ చిన్న ప్రయత్నం చాలు. సంజీవ చే సిన ఈ ప్రయత్నం విమాన ప్రయాణం మాత్రమే కాదు. కన్నవారిపై కొడుకుకున్న అంతులేని ప్రేమకు నిదర్శనం.
తల్లిదండ్రులకు విమాన ప్రయాణం ఏర్పాటు చేసిన కుమారుడు


