సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి

Nov 13 2026 8:27 AM | Updated on Nov 13 2026 8:27 AM

సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి

● హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలులో ప్రైవేట్‌ ఆస్పత్రులు భాగస్వాములు కావాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ ఆదేశించారు. రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర వైద్యం అందించే పీఎం రాహత్‌ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, అర్హులకు నగదు రహిత చికిత్స అందించాలని కోరారు. జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజమాన్యాలతో కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఆస్పత్రుల్లో సిజేరియన్లు, సాధారణ ప్రసవాల నిష్పత్తిపై ఆడిట్‌ నిర్వహించాలని పేర్కొన్నారు. అవసరం ఉన్నప్పుడే మాత్రమే సిజేరియన్లు చేయాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని స్పష్టం చేశారు. డీఎంహెచ్‌ఓ అప్పయ్య, ప్రోగ్రాం అధికారులు డాక్టర్లు రజిత, కృష్ణారావు, జ్ఞానేశ్వర్‌, ప్రదీప్‌రెడ్డి, ప్రైవేట్‌ ఆస్పత్రుల ప్రతినిధులు పాల్గొన్నారు.

బాలల ఆధార్‌ నమోదు పూర్తిచేయాలి

బాలలకు కొత్తగా ఆధార్‌ నమోదు చేయడంతోపాటు ఇప్పటికే ఆధార్‌ కార్డులు ఉన్న పిల్లల బయోమెట్రిక్‌ నవీకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో అధికారుల సమీక్షలో కలెక్టర్‌ మాట్లాడారు. అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీనివాస్‌, డీఈఓ గిరిరాజ్‌ గౌడ్‌, డీఐఈఓ గోపాల్‌, డీడబ్ల్యూఓ విశ్వజ, ఈడీఎం శ్రీధర్‌, యూఐడీఏఐ అసిస్టెంట్‌ మేనేజర్‌ శ్రవణ్‌ కుమార్‌, కలెక్టరేట్‌ డీసెక్షన్‌ సూపరింటెండెంట్‌ నాగరాజు, పోస్టల్‌ శాఖ ఇన్‌స్పెక్టర్‌ రవి, మీసేవ జిల్లా సమన్వయకర్త చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement