హన్మకొండ చౌరస్తా / కాజీపేట: తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి, వారి సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడుతామని తెలంగాణ ఉద్యమనేత, ప్రముఖ న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ల రవికుమార్ అన్నారు. ములుగు రోడ్డు జంక్షన్ నుంచి గుడిమళ్ల రవికుమార్ శుక్రవారం చేపట్టిన రెండో దశ ఉద్యమకారుల ఓదార్పు యాత్రను 1969వ సంవత్సర తెలంగాణ ఉద్యమకారుడు రామబ్రహ్మచారి ప్రారంభించారు. అక్కడి నుంచి హనుమకొండ చౌరస్తా, కాజీపేట వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఐక్యవేదిక హనుమకొండ జిల్లా అధ్యక్షుడు షేక్ ఉస్మాన్ అలీ, రాష్ట్ర నాయకులు వొడపెల్లి శ్యామ్‌కృష్ణ, జినుకుల లక్ష్మణ్, రెండ్ల సంతోష్, బొల్లిశెట్టి అశోక్, అనుముల రమేష్, రామగిరి ప్రభాకర్, దేవేందర్ రెడ్డి, అంజద్, గోపనబోయిన రాజు, బైరి రమేష్, స్వర్ణలత, రాంకుమార్, ఖదీర్, బొల్లపెల్లి శ్రీనివాస్, రాంపెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


