కాశిబుగ్గ: వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న ఉత్కర్ష–2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం ఇంపల్స్, సాయంత్రం షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో ఏర్పాటు చేిసిన కార్యక్రమంలో పలువురు మెడికోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఇంపల్స్ పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ దివ్వెల మోహన్‌దాసు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మూడు విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో మిస్టర్ ఇంపల్స్ విభాగంలో గోవింద్, మిస్ ఇంపల్స్ విభాగంలో వర్షిత, టీమ్ ఇంపల్స్ విభాగంలో వెరోజియన్స్ బృందం విజేతలుగా నిలించారు.
ఆకట్టుకున్న విద్యార్థుల షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్..
సాయంత్రం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. వైద్య విద్యార్థులు స్వయంగా చిత్రీకరించిన పలు లఘు చిత్రాలను ప్రదర్శించారు. మెడికోలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఉత్తమ చిత్రాన్ని ప్రదిర్శించిన బృందాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్‌దాస్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ శ్రీధర్, మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ మురళీ అభినందించారు. వైద్య విద్యతోపాటు ఇలాంటి సృజనాత్మక కళల్లోనూ ప్రతిభ కలిగి ఉండటం అభినందనీయమని పేర్కొన్నారు.
ఉత్సాహంగా పాల్గొన్న
వైద్య విద్యార్థులు


