హన్మకొండ అర్బన్: వీబీజీ రామ్‌జీ పథకం కింద పశుసంవర్థక శాఖకు కేటాయించిన నిధులతో జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఎంపీడీఓలు, ఏపీఓలు, పశువైద్యాధికారులకు సూచనలిచ్చారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పశువుల నీటి తొట్టెలు, పశువుల కొట్టాలు, కోళ్ల ఫారాల నిర్మాణంతో పాటు వ్యక్తిగత, సామూహిక పశుగ్రాసం పెంపకానికి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ఇందులో డీఆర్డీఓ మేన శ్రీను, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


