పిల్లల వార్డులో వెంటిలెటర్ల కొరత లేదు | - | Sakshi
Sakshi News home page

పిల్లల వార్డులో వెంటిలెటర్ల కొరత లేదు

Nov 13 2026 8:27 AM | Updated on Nov 13 2026 8:27 AM

పిల్లల వార్డులో వెంటిలెటర్ల కొరత లేదు హెచ్‌ఎం, ఆరుగురు టీచర్లకు షోకాజ్‌ నోటీసులు కుటుంబ కలహాలతో ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

● సూపరింటెండెంట్‌ రాంకుమార్‌రెడ్డి

కాశిబగ్గ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలోని పిల్ల ల వార్డులో వెంటిలెటర్ల కొరత లేదని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కాటం రాంకుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం సూపరింటెండెంట్‌ కార్యాలయంలో తమను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. పిల్లల వార్డులో అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, వెంటిలెటర్ల కొరత ఉన్నట్లు వస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం 12 వెంటిలెటర్లు పనిచేస్తున్నాయని, పిల్లలందరికీ అత్యవసర సేవలు వైద్య సిబ్బంది అందిస్తున్నారని వివరించారు.

తగ్గుముఖం పట్టిన జ్వరాలు...

ప్రస్తుతం వైరల్‌ ఫీవర్‌ పేషంట్లు ఎక్కువగా లేరని, అయినా వారి కోసం తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. జ్వరాలు తగ్గుముఖం పట్టడంతో బెడ్స్‌ కొరత కూడా లేదన్నారు. గత నెల పదిహేను రోజుల క్రితం పలు రకాల జ్వరాలకు సంబంధించిన పేషంట్లకు నివారణ చికిత్సలు అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం 15 నుంచి 20 వరకు జ్వరాల బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఇందులో ఒకరిద్దరు డెంగీ కేసులు ఉన్నాయని, వారికి తగిన చికిత్స చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కాళోజీ సెంటర్‌: వరంగల్‌ మండలంలోని ఇంతేజార్‌గంజ్‌ ప్రభుత్వ పాఠశాలను డీఈఓ ప్రశాంత్‌రెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠాలు బోధించడంలో నిర్లక్ష్యం, పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉండడాన్ని డీఈఓ గమనించారు. దీంతో హెచ్‌ఎం ఎం.మురళితో పాటు ఆరుగురు ఉపాధ్యాయులు సాహిదా సుల్తానా, అస్రాఫ్‌, మోహినుద్దీన్‌, మాసుక్‌ రబ్బాని, ఎండీ షర్ఫోద్దీన్‌, ఎ.సుల్తానాకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఈ పాఠశాలను ఇటీవల కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇదే పరిస్ధితి ఆమె దృష్టికి రాగా సున్నితంగా మందలించారు. ఉపాధ్యాయుల్లో ఎలాంటి మార్పు రాలేదని గుర్తించిన డీఈఓ ప్రశాంత్‌రెడ్డి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

రాష్ట్రస్థాయి తైక్వాండో

పోటీలకు ఎంపిక

కాశిబుగ్గ: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన తైక్వాండో అండర్‌–14 బాలబాలికల పోటీల్లో వరంగల్‌ కొత్తవాడలోని భరత్‌ స్కూల్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పాఠశాల నుంచి 20 మంది పాల్గొనగా.. 15 మంది విద్యార్థులు పతకాలు సాధించినట్లు యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో ప్రకటించింది. రెండు బంగారు, రెండు వెండి, 11 కాంస్య పతకాలు పొందారని తెలిపారు. ఈ సందర్భంగా కోచ్‌ కల్లెపల్లి రమేష్‌, క్రీడాకారులను అభినందించారు.

కాజీపేట: కుటుంబ కలహాలతో హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ సుంచు నాగ కిషన్‌ (40) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. నాగ కిషన్‌ దంపతులకు గొడవలు కావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఆటో నడిపి ఇంటికి చేరుకున్న నాగకిషన్‌ జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement