పోచమ్మమైదాన్: విద్యార్థులు వైద్యవిద్యతోపాటు కళలు, సాహిత్యంపై మక్కువ కలిగి ఉండాలని కేఎంసీ ప్రిన్సిపాల్ దివ్వెల మోహన్‌దాస్ అన్నారు. కాకతీయ మెడికల్ కళాశాలలో నిర్వహిస్తున్న ‘ఉత్కర్ష’–2026 రెండో రోజు కార్యక్రమంలో భాగంగా గు రువారం ‘కళావైభవ్’ సాహిత్య, కళాపోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక ప్రతిభ, క ళాత్మక నైపుణ్యాలను ఇలాంటి కార్యక్రమాల ద్వారా వెలికి తీయొచ్చన్నారు. 2022 బ్యాచ్ జెంటారియంజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో 300 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ప్రిన్సిపాల్ మోహన్‌దాస్, బయోకెమిస్ట్రీ అసోసియే ట్ ప్రొఫెసర్ రమేశ్ బహుమతులు అందజేశారు.
వివిధ పోటీల విజేతలు వీరే..
గ్లాస్ పెయింటింగ్ పోటీలో సాయి ప్రతి మ, టోట్ పెయింటింగ్‌లో అంజలి, ఫేస్ పెయింటింగ్‌లో సు ప్రియ, అర్చిశ్రీ, టీ షర్టు పెయిటింగ్‌లో జాగృతి, మండల ఆర్ట్‌లో ప్రణవ్నాథ్, బోకె మేకింగ్‌లో అ ఖిల్, థీమ్ ఆర్ట్‌లో హరిత, క్లే మోడలింగ్‌లో గుణశేఖర్ విజేతలుగా నిలిచారు. ఈ పోటీలతో ప్రతిభ ప్రోత్సహించారని మెడికోలు సంతోషం వ్యక్తం చేశారు.
కాకతీయ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ మోహన్‌దాస్
కేఎంసీలో ఘనంగా ‘కళావైభవ్’ సాహిత్య పోటీలు


