హసన్‌పర్తి: పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి త్వరితగతిన అరెస్ట్ చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత ఆదేశించారు. గురువారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో డీసీపీలు, ఏసీపీల స్థాయి అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్స్టేషన్ల్లో నమోదైన కేసులు, దర్యాప్తులు, నిందితుల అరెస్ట్‌లు, సాక్ష్యాధారాల సేకరణ, కోర్టు కేసుల పురోగతులను సమగ్రంగా సమీక్షించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారులపై నేరాలు, ఆస్తి వివాదాలు, సైబర్నేరా లు, మాదక ద్రవ్యాల కేసులు, తీవ్ర నేరాల దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందేలా దర్యాప్తును పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో డీసీపీలు అంకిత్‌కుమార్, దార కవిత, రాజమహేంద్రనాయక్, అదనపు డీసీపీలు రాయల ప్రభాకర్‌రావు, ఏసీపీలు మధుసూదన్, సదయ్య, డేవిడ్ రాజు తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత


