ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి

Oct 31 2026 8:19 AM | Updated on Oct 31 2026 8:19 AM

ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి

అదనపు ఎన్నికల అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి

న్యూశాయంపేట: వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్‌ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఓటరు నమోదు ప్రక్రియపై శుక్రవారం వరంగల్‌ కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫారం–18 దరఖాస్తుల పరిశీలన, అర్హత ప్రమాణాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అర్హులైన పట్టభద్రులంతా ఓటరుగా నమోదు చేసుకునేలా అవకాశం కల్పించాలని సూచించారు. దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి

ఎల్‌నినో ప్రభావంపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పించాలని, శాఖల వారీగా కార్యాచరణ రూపొందించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ఈసందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఎల్‌నినోపై రూపొందించిన పాట సీడీని కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్లు కిషోర్‌కుమార్‌, వైవీ.గణేశ్‌, హనుమకొండ అదనపు కలెక్టర్‌ రవి, మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ ప్రసన్నరాణి, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఆనందం పాల్గొన్నారు.

సోలార్‌ ప్రాజెక్ట్‌ల పురోగతిపై కలెక్టర్‌ సమీక్ష

రెడ్‌కో (రినెవెబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) ఆధ్వర్యంలో జిల్లాలో చేపడుతున్న పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలు, వివిధ సోలార్‌ ప్రాజెక్ట్‌ల పురోగతిపై శుక్రవారం కలెక్టర్‌ సత్యశారద కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మోడల్‌ సోలార్‌ విలేజ్‌గా పర్వతగిరికి సంబంధించిన డీపీఆర్‌పై సమీక్షించి ప్రాజెక్ట్‌ అమలుకు సంబంధించిన అంశాలను చర్చించారు. పోతిరెడ్డిపల్లి, కిష్టాపూర్‌ మోడల్‌ సోలార్‌ విలేజీల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. ఈసందర్భంగా సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటు, పనుల అమలు, సంబంధిత శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో రెడ్‌కో జిల్లా మేనేజర్‌, రాజేందర్‌, ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ ఆనందం, జెడ్పీ సీఈఓ వసంత, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ జీవన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement