న్యూశాయంపేట: జనగణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. సేకరించే గణాంకాలు భవిష్యత్ ప్రణాళికలకు కీలక ఆధారంగా నిలుస్తాయని పేర్కొన్నారు. జనగణన –2027 కార్యక్రమంలో భాగంగా రెండోదశ జనగణన నిర్వహణపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో అధికారులు, సిబ్బందికి రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జనగణన ప్రాముఖ్యత, జనాభా గణన నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమాచార సేకరణలో కచ్చితత్వం, పారదర్శకత, అధికారుల బాధ్యత తదితర అంశాలపై కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌కు చెందిన జిల్లా సెన్సెస్ ఆపరేషన్స్ విభాగం ఎస్‌ఓ శిక్షణాధికారి సతీష్ హాజరై అధికారులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎల్.కిశోర్‌కుమార్, వైవీ గణేశ్, జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, సీపీఓ చంద్రకళ, పాల్గొన్నారు.
అర్నబ్ తుపానుతో అప్రమత్తంగా ఉండాలి
అర్నబ్ తుపాను నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశంఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. ప్రజల సహాయార్థం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వివరించారు. టోల్‌ఫ్రీ నంబర్ 1800 4253424, 91542 52936 నంబర్లలో సంప్రదించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
రెండో దశ జనగణనపై కలెక్టరేట్‌లో
అధికారులకు శిక్షణ


