సామాజిక సేవలో భాగస్వాములను చేయాలి | - | Sakshi
Sakshi News home page

సామాజిక సేవలో భాగస్వాములను చేయాలి

Oct 28 2026 6:00 AM | Updated on Oct 28 2026 6:00 AM

సామాజిక సేవలో భాగస్వాములను చేయాలి

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: యువతను టీబీ ముక్త్‌ భారత్‌తో పాటు వివిధ సామాజిక సేవాకార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. హనుమకొండలోని యువజన వసతి గృహంలో మౌలిక వసతులు మెరుగుపరచాలని సూచించారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో మై భారత్‌ సమన్వయకర్తలు, అధికారులతో మంగళవారం కలెక్టర్‌ సమావేశమయ్యారు. మై భారత్‌ పోర్టల్‌లో నమోదైన యువత సంఖ్య, సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను జిల్లా అధికారి భూక్యా సంజీవ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో మై భారత్‌ స్వచ్ఛంద కార్యకర్తలు, యువత చురుగ్గా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. శిక్షణ కోసం జిల్లాకు వచ్చిన వివిధ రాష్ట్రాల అధికారులు చారిత్రక వరంగల్‌ ప్రాంతంలోని వేయిస్తంభాల దేవాలయం, రామప్ప, మేడారం, కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువులు, ఆలయాల చారిత్రక ప్రాధాన్యాన్ని తెలుసుకోవాలని సూచించారు. హనుమకొండలోని యువజన వసతి గృహంలో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం వికసిత్‌ భారత్‌ యువజన పార్లమెంట్‌ 2026–27 పోస్టర్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. సమావేశంలో జాతీయ యువజన అవార్డు గ్రహీత మండల పరశురాములు, ఆర్‌అండ్‌బీ డీఈ గోపీకృష్ణ, ఏఈ ఉదయ్‌, క్రీడల శాఖకు చెందిన మౌనిక, పింగళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం అధికారులు డాక్టర్‌ రత్నమాల రమ, డాక్టర్‌ మమత తదితరులు పాల్గొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులను

వేగంగా పరిష్కరించాలి

ప్రజావాణిలో ఎకై ్సజ్‌ శాఖకు వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌.. అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఎకై ్సజ్‌ శాఖపై కలెక్టర్‌ సమీక్షించారు. అధికారుల పనితీరు, అక్రమ మద్యంపై పెట్టిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణిలో వచ్చిన 27 దరఖాస్తులను పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. సమావేశంలో ఎకై ్సజ్‌ శాఖ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ రావు, శిక్షణ అధికారి నిలోఫర్‌ అజ్మీ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement