కాళోజీ సెంటర్: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) జిల్లా శాఖ నాయకులు కోరారు. ఈ మేరకు వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి ప్రశాంత్ రెడ్డిని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు వర్క్ అడ్జస్ట్‌మెంట్ కింద వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకాలను త్వరితగతిన చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. స్కావెంజర్ల వేతనాలను విడుదల చేయాలని, డీఎస్సీ –2024 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు రెండో ఇంక్రిమెంట్ మంజూరు చేయడంతోపాటు ప్రొబేషనరీ డిక్లేర్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదుల వీరస్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ ముజాహిద్, కార్యదర్శి బెల్లంకొండ పూర్ణచందర్, పూర్వ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పూర్వ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్, మండల బాధ్యులు రాజేష్, కొమురయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


