కేయూ పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్ష వాయిదా | - | Sakshi
Sakshi News home page

కేయూ పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్ష వాయిదా

Oct 7 2026 2:10 AM | Updated on Oct 7 2026 2:10 AM

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో దూరవిద్య కేంద్రం పీజీ మూడో సెమిస్టర్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే, ఈనెల 9న నిర్వహించాల్సిన పరీక్షను వాయిదావేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌ తెలిపారు. వాయిదాపడిన పరీక్షను ఈనెల 10న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మిగతా పేపర్ల పరీక్షలు టైంటేబుల్‌ ప్రకారం య థావిఽధిగా జరుగుతాయని తెలిపారు. విద్యార్థులు ఈమార్పును గమనించి తదనుగుణంగా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

బీఫార్మసీ పరీక్షల్లో ఏడుగురు విద్యార్థుల డీబార్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీఫార్మసీ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం నగరంలోని పలు కేంద్రాలను పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి పద్మజ తనిఖీ చేశారు. శివానీ ఫార్మసీ కళాశాలలో కాపీయింగ్‌ చేస్తూ ఆరుగురు విద్యార్థులు, కేర్‌ ఫార్మసీ కళాశాలలో కాపీయింగ్‌ చేస్తూ ఒకరు మొత్తం ఏడుగురు పట్టుబడగా వారిని డీబార్‌ చేసినట్లు రాజేందర్‌ తెలిపారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థులపై నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని వివరించారు.

‘సూపర్‌’ పనులు

పర్యవేక్షించిన డీఎంఈ

కాశిబుగ్గ: వరంగల్‌లో చేపట్టిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను డీఎంఈ వాణి పర్యవేక్షించారు. మంగళవారం నేరుగా ఆమె స్పెషల్‌ ఆఫీసర్లతో కలిసి ఆస్పత్రికి చేరుకుని నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. పలు ఫ్లోర్లలో జరుగుతున్న పనులను స్వయంగా పరిశీలించి, అధికారులకు సూచనలు అందజేశారు. అలాగే, పలు విభాగాలకు చెందిన హెచ్‌ఓడీలతో రాత్రి వరకు సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. సూపర్‌ పనులను త్వరగా పూర్తి చేస్తేనే ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్‌తో పాటు ముగ్గురు నోడల్‌ ఆఫీసర్ల పర్యవేక్షణతో జరుగుతున్న పనుల తీరును నిశ్చితంగా పరిశీలించారు. దసరా పండుగ లోపు కనీసం ఓపీ సేవలను అందుబాటులో తీసుకొచ్చే ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో వైద్యాధికారులు ముందుకెళ్తున్నారు.

ఎస్సై, కానిస్టేబుల్‌

ఉద్యోగాలకు ఉచిత శిక్షణ

న్యూశాయంపేట: ఇటీవల ప్రభుత్వం పోలీస్‌శాఖలో నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామకాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ వరకు ఉచిత రెసిడెన్సియల్‌ శిక్షణ అందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి హమీద్‌, ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఉమ్మడి జిల్లా సంచాలకులు డాక్టర్‌ కే.జగన్‌లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ వడ్డేపల్లిలోని షెడ్యూల్‌ కులాల స్టడీ సర్కిల్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా బ్రాంచిలో శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 10వ తేదీ వరకు గడువు ఉందన్నారు. మరిన్ని వివరాలకు 9160606862 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

డ్రాప్‌బాక్స్‌ విద్యార్థులపై ప్రత్యేక పరిశీలన

కాళోజీ సెంటర్‌: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 2027 నేపథ్యంలో యూడైస్‌ ప్లస్‌ పోర్టల్‌లోని డ్రాప్‌బాక్స్‌లో ఉన్న పదో తరగతి విద్యార్థుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా విద్యాశాఖాధికారి బి. రంగయ్యనాయుడు ఎంఈఓలకు కీలక ఆదేశాలు జారీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డ్రాప్‌బాక్స్‌లో ఉన్న విద్యార్థులు పాఠశాల మానేసినవారా? గుర్తింపు లేని పాఠశాలలకు చెందినవారా? అనే విషయాలను క్షేత్రస్థాయిలో నిర్ధారించాలని సూచించారు.

ముగ్గురి తొలగింపు

విద్యారణ్యపురి: నకిలీ సర్టిఫికెట్లతో ప్రభుత్వ జూని యర్‌ కళాశాలల్లో జూనియర్‌ లెక్చరర్లుగా విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురిని ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులు తొలగించారని తెలిసింది. జయశంకర్‌ భూ పాలపల్లి జిల్లాలోని కాటారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఇంగ్లిష్‌ జూనియర్‌ లెక్చరర్‌ రాజబాబు, మహబూబాబాద్‌ జిల్లా గార్ల ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మ్యాథ్స్‌ లెక్చరర్‌ సత్యనారాయణను, గ తంలో జనగామ జిల్లా ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని చేర్యాల కళాశాల మ్యాథ్స్‌ లెక్చరర్‌ పరుశరాములును తొలగించారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement