రైస్‌మిల్లర్ల వద్దే 2022–23 సీజన్‌ సీఎంఆర్‌ | - | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లర్ల వద్దే 2022–23 సీజన్‌ సీఎంఆర్‌

Sep 30 2026 1:40 AM | Updated on Sep 30 2026 1:40 AM

‘పెన్షన్‌ రూల్స్‌ చట్టాన్ని రద్దు చేయాలి’ నేడు ‘డయల్‌ యువర్‌ డీఎం’ ముగిసిన ఎస్‌జీఎఫ్‌ పోటీలు 13 నుంచి నిరవధిక సమ్మె నగరంలో రోడ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి 50 ప్రగతి నగరాల్లో ఓరుగల్లుకు చోటు

న్యూస్‌రీల్‌

సమాజ మార్పుకోసం ఏఐఎస్‌ఎఫ్‌ ఉద్యమించాలి

8

లోu

బుధవారం శ్రీ 30 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026

చీర, సారెతో వస్తున్న హీరో నాని, గద్దెల ప్రాంగణంలో చిత్రబృందం

హన్మకొండ అర్బన్‌: పెన్షన్‌ రూల్స్‌ వ్యాలిడేషన్‌ చట్టం–2025ను రద్దు చేయాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్‌ అసోసియేషన్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు పరికిపండ్ల వేణు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆల్‌ ఇండియా స్టేట్‌ గవర్నమెంట్‌ పెన్షనర్స్‌ ఫెడరేషన్‌ ఇచ్చిన పిలుపు మేరకు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ మొదటి దశలో కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, రెండో దశ డిసెంబర్‌ 12న న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ ర్యాలీ, మూడో దశలో డిసెంబర్‌ 13న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్ల సంయుక్త సదస్సు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ధర్నా అనంతరం 12 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు పెండ్యాల బ్రహ్మయ్య, వర్కింగ్‌ జనరల్‌ సెక్రటరీ బేతి శంకర్‌ లింగం, ఆర్థిక కార్యదర్శి సిద్ధి రాజయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు, యూనిట్ల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.

హన్మకొండ: ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు, సలహాలు సూచనలు స్వీకరించడానికి బుధవారం డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్‌–1 డిపో మేనేజర్‌ పుప్పాల అర్పిత తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హనుమకొండలోని వరంగల్‌–1 డిపో నుంచి డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్‌, నిజామాబాద్‌, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల తదితర రూట్ల ప్రయాణికులు 9959226047 నంబర్‌కు ఫోన్‌చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని, సమస్యలు చెప్పాలని డీఎం కోరారు.

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లో రెండు రోజులపాటు జరిగిన 70వ హనుమకొండ జిల్లాస్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌–14, 17 బాలబాలికల ఎంపిక పోటీలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేసి మాట్లాడుతూ క్రీడాకారులు చదువుతో పాటు క్రీడల్లో రాణించడం అభినందనీయమని అన్నారు. డీఈఓ గిరిరాజ్‌గౌడ్‌ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి క్రీడల్లో రాణించాలని సూచించారు. కబడ్డీ, ఖోఖ, వాలీబాల్‌ క్రీడల్లో ఎంపికలు నిర్వహించినట్లు ఎస్‌జీఎఫ్‌ హనుమకొండ జిల్లా నిర్వహణ కార్యదర్శి వాసుదేవరావు తెలిపారు. వివిధ మండలాల నుంచి మొదటి రోజు 2,100, రెండో రోజు 366 మంది క్రీడాకారులు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. డీవైఎస్‌ఓ ప్రశాంత్‌, టీఎస్‌ పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, టీజీ పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, శ్రీధర్‌రావు, కుమారస్వామి, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హన్మకొండ అర్బన్‌: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అక్టోబర్‌ 13 నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగ జేఏసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌, డీఎంహెచ్‌ఓ అప్పయ్యకు సమ్మె నోటీస్‌ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని సుమారు 17 వేల మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, పీఆర్సీ, 5 శాతం ఇంక్రిమెంట్‌, 8 శాతం లాయల్టీ బోనస్‌, 100 శాతం గ్రాస్‌ జీతం అమలు చేయాలని కోరారు. మాతృత్వ సెలవులు, ఇన్సూరెన్‌్స్‌, సర్వీస్‌ కొనసాగింపు, ఆర్‌ఓపీ తదితర సమస్యలు పరిష్కరించాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మె చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మహేందర్‌రావు పుట్ట, ప్రధాన కార్యదర్శి ఎండీ రుక్ముద్దీన్‌, కోశాధికారి, సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ మొగిలి నరేశ్‌, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

రికవరీ

కావాల్సిన ధాన్యం:

1,11,634

మె.టన్నులు

వేలం వేసిన

ధాన్యం జాడేది..

2022–23 రబీలో సీఎంఆర్‌ను రైసుమిల్లర్లు ఎంతకు చెల్లించకపోవడంతో పౌరసరఫరాలసంస్థ.. 216 మిల్లుల్లో ఉన్న రూ.250.92 కోట్ల విలువ చేసే 1,11,634 మె.టన్నుల ధాన్యం మొత్తానికి వేలం వేసింది. తీరా టెండర్లు ముగిశాక వెళ్లి చూస్తే చాలా మిల్లుల్లో ధాన్యం లేకపోవడంతో మళ్లీ రికవరీపైనే దృష్టి సారించారు. విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, పౌరసరఫరాల సంస్థలు సంయుక్తంగా పోలీసుశాఖ సహాయంతో రంగంలోకి దిగడంతో కొంత మేరకు వసూలైనా.. ఇంకా రూ.కోట్లల్లో పెండింగ్‌ పడ్డాయి. ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాల్లో 96 మిల్లుల వద్ద ఈ బకాయిలు ఉన్నట్లు నివేదిక పేర్కొంటోంది. జనగామ, వరంగల్‌ జిల్లాల్లో 54 మిల్లుల వద్ద బకాయిలు ఉన్నాయి. ములుగులో 13, హనుమకొండ, మహబూబాబాద్‌ జిల్లాల్లో 24, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ఐదు మిల్లుల వద్ద బకాయిలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల సైతం కొందరు మిల్లర్లు బకాయిలు చెల్లిస్తున్నప్పటికీ.. వసూళ్ల కోసం తదుపరి చర్యలపై చర్చ మొదలైంది. బకాయిదారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడమా? రెవెన్యూ రికవరీ యాక్టు కింద చర్యలు తీసుకోవడమా? బకాయిదారుల ఆస్తులను గుర్తించి జప్తు ప్రక్రియ చేపటడమా? అన్న అంశాలు కీలకంగా మారాయి. ఇప్పటికే నోటీసులు జారీ చేసిన మిల్లర్లు కొందరిపై పోలీసు కేసులు నమోదు చేయడం చర్చనీయాంశం అవుతోంది.

రికవరీ చేసిన

ధాన్యం:

37,825

మె.టన్నులు

ధాన్యం విలువ: రూ.250.92

కోట్లు

బకాయి ఉన్న

ధాన్యం:

73,809

మె.టన్నులు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

రైతులనుంచి ప్రభుత్వం సేకరించిన ధాన్యం.. రైసుమిల్లులకు కేటాయింపు.. మిల్లింగ్‌ చేసి సీఎంఆర్‌ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగింత. ఇదీ సాధారణ ప్రక్రియ. కానీ ఉమ్మడి వరంగల్‌లో రబీ 2022–23 సీజన్‌కు సంబంధించిన లెక్కలు చూస్తే.. ధాన్యం కేటాయించి సుమారు మూడేళ్లు దాటినా రికవరీ మాత్రం పూర్తికాలేదు. కోట్ల రూపాయల విలువైన ధాన్యం, బియ్యం బకాయిలు మిల్లర్ల వద్దే నిలిచిపోయాయి. సీఎంఆర్‌ చెల్లించని మిల్లుల్లో వేలం వేసిన ధాన్యానికి సంబంధించిన లెక్కలు కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

కాగితాలపై లెక్కలు.. మిల్లులు దాటని బకాయిలు..

పౌరసరఫరాల సంస్థ ఇటీవల ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రకారం.. ఉమ్మడి వరంగల్‌లోని హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఇంకా ధాన్యం బకాయిలు ఉన్నాయి. 216 మిల్లులకు ఇచ్చిన 1,11,634 మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి 37,825 మెట్రిక్‌ టన్నులు మాత్రమే రికవరీ అయ్యాయి. మరో 73.809 మె.టన్నుల ధాన్యం మిల్లర్ల వద్ద ఉంది. విలువ పరంగా రూ.166.30 కోట్ల మేర రికవరీ చేయాల్సి ఉందని ఆ నివేదికలో పౌరసరఫరాల సంస్థ పేర్కొంది. రబీ 2022–23 సీజన్‌కు సంబంధించిన రికవరీ పూర్తికాకపోవడం అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

బకాయిదారుల ఆస్తులపై ‘విజిలెన్స్‌’ ఆరా!

భారీగా బకాయిలు పేరుకుపోవడంతో బకాయిదారుల ఆస్తుల వివరాల సేకరణలో పౌరసరఫరాల సంస్థ, విజిలె న్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నిమగ్నమైనట్లు సమాచారం. కొందరు బకాయి ఉన్న రైసుమిల్లర్లు తమ స్థిర, చరాస్తులను బినామీల పేరిట మార్పిడి చేశారన్న ప్రచారం ఉంది. మిల్లులను ఎత్తివేసి వాటి స్థానంలో ఫంక్షన్‌హాళ్లు, సీడ్‌ మిల్లులుగా మార్చినట్లు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బకాయిదారుల ఆస్తుల వివరాల సేకరణ ‘విజిలెన్స్‌’ దృష్టి సారించాన్న చర్చ సర్వత్రా కలకలం రేపుతోంది. కాగా ఈ విషయమై ఉమ్మడి వరంగల్‌కు చెందిన ఓ జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారిని సంప్రదించగా సీరియస్‌గా బకాయిల వసూళ్లు జరుగుతున్నాయని, తమను ఆ వివాదంలోకి లాగొద్దంటూ సమాధానం దాటవేశారు.

గ్రేటర్‌ కమిషనర్‌ టి.వెంకన్న

వరంగల్‌ అర్బన్‌: నగరంతోపాటు విలీన గ్రామాల్లోని రోడ్లు, డివైడర్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు. హనుమకొండ వడ్డేపల్లి చర్చి నుంచి ఉనికిచర్ల ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు చేపట్టిన పారిశుద్ధ్య పనులను కమిషనర్‌ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజారెడ్డి, ఈఈ సంజయ్‌కుమార్‌, శానిటరీ సూపర్‌వైజర్‌ నరేందర్‌, శానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గొర్రెకుంట, గోపాల్‌పూర్‌, ప్రశాంత్‌నగర్‌, కాజీపేట భవానీనగర్‌లో భవన నిర్మాణాలను సీపీ తనిఖీ చేశారు. సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, టీపీఓలు అవినాష్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించాలి..

పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో జవాన్లు కీలక భూమిక పోషించాలని కమిషనర్‌ టి.వెంకన్న ఆదేశించారు. ఎల్‌బీ కళాశాలలో పారిశుద్ధ్య జవాన్లతో కమిషనర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల రోజుల అనంతరం తిరిగి సమావేశం నిర్వహించి పనితీరును సమీక్షిస్తానని తెలిపారు. సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్‌ 2న గ్రేటర్‌ పరిధిలోని 66 డివిజన్లలో అన్ని గొర్రెలు, మేకల వధశాలలు, చికెన్‌ షాపులు, రిటైల్‌ మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి

మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ వెల్లడి

వరంగల్‌ అర్బన్‌: దేశవ్యాప్తంగా ఉన్న 50 ప్రగతి నగరాల్లో ఓరుగల్లు ఒకటిగా నిలిచింది. రాష్ట్రంలో హైదరాబాద్‌, వరంగల్‌కు చోటు లభించింది. ఈ మేరకు మంగళవారం న్యూఢిల్లీ నుంచి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ 50 ప్రగతి నగరాల వివరాలను వెల్లడించారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌–2026కు అనుగుణంగా నాలుగు రకాల వ్యర్థాలను మూలస్థాయిలోనే వేర్వేరుగా సేకరించాలని సూచించారు. పారిశుద్ధ్య సమస్యలు, ఫిర్యాదులను సులభతరం చేయడం, వాట్సాప్‌ ఆధారిత ప్రజా ఫిర్యాదుల వ్యవస్థకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర మంత్రి వివరించారు. నగరాల పరిశుభ్రతను మరింత మెరుగుపరచడంతో పాటు ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హనుమకొండలోని కమిషనర్‌ క్యాంపు కార్యాలయం నుంచి గ్రేటర్‌ కమిషనర్‌ టి.వెంకన్న, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఎంహెచ్‌ఓ రాజేశ్‌ పాల్గొన్నారు.

సీపీఐ జాతీయ

కార్యదర్శి

పల్లా వెంకట్‌రెడ్డి

ఉమ్మడి జిల్లాలో రూ.166.30 కోట్ల రికవరీ పెండింగ్‌..

జాడలేని 73,809 మెట్రిక్‌ టన్నుల

వేలం ధాన్యం

మొత్తం బకాయిలు 96 మిల్లుల వద్ద.. ప్రశ్నార్థకంగా మారిన వసూళ్లు

తెరపైకి క్రిమినల్‌ కేసులు..

ఆర్‌ఆర్‌ యాక్టులు..

బకాయిదారుల ఆస్తుల వివరాలపై ‘విజిలెన్స్‌’ ఆరా!

వసూలైన

మొత్తం:

రూ.84.61

కోట్లు

ఇంకా

బకాయి ఉన్న

మిల్లులు:

96

బకాయి

మొత్తం:

రూ.166.30

కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement