ప్రమాదాలకు అడ్డుకట్ట పడాలి | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాలకు అడ్డుకట్ట పడాలి

Sep 30 2026 1:40 AM | Updated on Sep 30 2026 1:40 AM

ప్రమాదాలకు అడ్డుకట్ట పడాలి

మామునూరు: జాతీయ రహదారిపై ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్‌ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఆర్టీఏ జంక్షన్‌ నుంచి ఇల్లందు వరకు ప్రమాదకర ప్రాంతాలను ఏసీపీ వెంకటేశ్‌, ఎంవీఐ శోభన్‌బాబు, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత మంగళవారం పరిశీలించారు. ప్రమాదాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా గుర్తించారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రహదారి పరిస్థితులు, వాహనాల రాకపోకలు, మలుపులు, ప్రమాదాలకు దారితీస్తున్న ఇతర కారణాలపై సీపీ ఆరా తీశారు. ఆర్టీఏ జంక్షన్‌ నుంచి బొల్లికుంట క్రాస్‌ వరకు నిత్యం జరుగుతున్న ప్రమాదాల వివరాలను పరిశీలించి, ఇకపై ప్రమాదాలు జరగకుండా అవసరమైన భద్రతా చర్యలను చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. జాతీయ రహదారిపై బ్లాక్‌స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్‌హైపె 108 రోడ్డు ప్రమాదాలు జరగగా.. 80 మంది మరణించారు.

లక్ష్యంతో ముందుకు సాగితే ఫలితం

హసన్‌పర్తి: లక్ష్యంతో ముందుకు సాగితే ఫలితం వస్తుందని సీపీ శ్వేత అన్నారు. ఉచిత కోచింగ్‌ స్క్రీనింగ్‌లో ఉత్తీర్ణత సాధించిన 560 మంది అభ్యర్థులకు శిక్షణ తరగతుల నిర్వహణపై ముందస్తు సమావేశం మంగళవారం నిర్వహించారు. భీమారంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో సీపీ శ్వేత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత, అడిషనల్‌ డీసీపీ సురేశ్‌, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, కేయూసీ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేత

జాతీయ రహదారిపై బ్లాక్‌స్పాట్ల గుర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement