న్యూశాయంపేట: మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం కలెక్టరేట్ చాంబర్‌లో వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వీ హబ్ సంస్థ డైరెక్టర్ ఊహ, బృందం సభ్యులతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డీఆర్‌డీఓ నాగ పద్మజ, ఆర్డీఓ సుమ, వర్ధన్నపేట తహసీల్దార్ విజయ్‌సాగర్, అధికారులు పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద


