మామునూరు: మామునూరు టీజీఎస్పీ నాలుగో బెటాలియన్ ప్రాంగణంలోని పీటీసీలో జరుగుతున్న ఎన్‌సీసీ క్యాంపును మంగళవారం ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ డైరెక్టరేట్ డిప్యూటీ డీజీ ఎయిర్ కమాండర్ నరసింగ్ సైలానీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా వాయు సైనిక్ క్యాంపు (ఏఐవీఎస్‌సీ)లో కేడెట్ల భాగస్వామ్యానికి సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన కేడెట్లకు బహుమతులు ప్రదానం చేశారు. అంతకు ముందు ఎన్‌సీసీ గ్రూప్ హెచ్‌క్యూలో శిక్షణ, పరిపాలనా అంశాలపై కమాండింగ్ అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. అంకితభావంతో కేడెట్లకు శిక్షణ ఇస్తున్న ట్రైనర్లకు ప్రశంసపత్రాలు అందజేసి అభినందించారు.


