జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో నేడు (శనివారం) మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించనున్నారు. ముందుగా మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అనంతరం పట్టణంలోని 13వ వార్డులో గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని, అక్కడి నుంచి నేరుగా బహిరంగ సభకు హాజరుకానున్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జేఎన్‌ఎస్‌లోని కబడ్డీ హాల్‌లో శుక్రవారం నిర్వహించిన 70వ పాఠశాల క్రీడల సమాఖ్య హనుమకొండ జిల్లా స్థాయి అండర్–17 కబడ్డీ బాలబాలికలు ఎంపిక పోటీలు సందడిగా కొనసాగాయి. జిల్లాలోని 14 మండలాల నుంచి 336 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు ఎస్‌జీఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వాసుదేవరావు తెలిపారు. ఎంపిక పోటీలకు ముఖ్య అతిథిగా డీవైఎస్‌ఓ ప్రశాంత్, పీఈటీల సంఘం అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, పార్థసారఽథి, కార్యదర్శి మల్లారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్, వెంకటేశ్వర్లు, పీడీ రాజేశ్వర్, పావని, రెబెకా, కిషన్, శ్యామ్, కిరణ్, జ్యోతి, రాజేశ్వరి, హారిక, శారద, వనజ, ధనలక్ష్మి, స్వప్న, సురేశ్, వినయ్, సుభాష్, సునీల్, రాజు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ కావ్య విజ్ఞప్తి
హన్మకొండ చౌరస్తా: వరంగల్‌లో ప్రస్తుతం ఉన్న పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం స్థానంలో పూర్తిస్థాయి పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని కోరాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య.. సీఎం రేవంత్‌రెడ్డిని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి ఆమె సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ అభివృద్ధిపై అనేక అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. 2017, మార్చి 29న ఏర్పాటు చేసిన కేంద్రం ద్వారా ప్రాంత ప్రజలకు సేవలు అందుతున్నాయని, పాస్‌పోర్ట్ సేవలకు డిమాండ్ పెరుగుతోందని తెలిపారు. కేయూకు పీఎం ఉషా నిధుల మంజూరు, వరంగల్ కోటలో పురావస్తు మ్యూజియం అభివృద్ధికి కేంద్ర నిధులు, వరంగల్‌లో నైలిట్, సీఐటీడీ కేంద్రాల ఏర్పాటు అంశాలను వివరించారు. వివిధ అంశాలపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ కావ్య తెలిపారు.


