ఎగిసిపడిన అగ్నికీలలు | - | Sakshi
Sakshi News home page

ఎగిసిపడిన అగ్నికీలలు

Sep 26 2026 1:44 AM | Updated on Sep 26 2026 1:44 AM

ఎగిసిపడిన అగ్నికీలలు

హసన్‌పర్తి: నగరంలో తెల్లవారుజామున అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. జవహర్‌కాలనీ క్రాస్‌ వద్ద శుక్రవారం ప్రభాత సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అంతెత్తు ఎగిసిపడిన మంటలతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అర్పేశారు. నగరంలోని జవహర్‌కాలనీ రోడ్‌ నంబర్‌–9 ప్రాంతానికి చెందిన భూక్య భద్రు సరస్వతి ఎంటర్‌ ప్రైజెస్‌, సరస్వతి హార్డ్‌వేర్‌ అండ్‌ పెయింట్స్‌ షాపు నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి 8 గంటలకు షాప్‌ బంద్‌ చేసి ఇంటికి వెళ్లాడు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2.40 గంటల ప్రాంతంలో షాపుల నుంచి మంటలు ఎగసిపడుతుండడంతో స్థానికులు గుర్తించి భద్రుకు సమాచారం ఇచ్చారు. భారీ మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వాసులు ఆందోళనకు గురయ్యారు. తమ ఇళ్లలోకి మంటలు వ్యాపిస్తాయేమోనని భయాందోళన చెందారు. తెల్లవారు వరకు కంటిమీద కునుకు లేకుండా ఉండిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పేశారు. మంటలు అదుపులోకి తీసుకురావడానికి సుమారు 5 గంటల సమయం పట్టింది. కాగా, ఈ ప్రమాదంలో రెండు షాపుల్లో సుమారు రూ.3.50 కోట్ల నష్టం జరిగింది. భద్రు సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

రూ.3.50 కోట్ల విలువైన ఆస్తి నష్టం

జవహర్‌ కాలనీలోని

హార్డ్‌వేర్‌ షాపులో ఘటన

మంటలు వ్యాపిస్తాయని

కాలనీవాసుల భయాందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement